https://oktelugu.com/

Karthika Deepam : కార్తీక దీపం 2 లో అతిపెద్ద మార్పు… వర్క్ అవుట్ అవుతుందా?

కార్తీక దీపం 2ను నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నాడని స్పష్టం అయింది. అయితే ఈ ప్రోమోలో ఎక్కడా వంటలక్క, డాక్టర్ బాబు ప్రస్తావన తేలేదు. సౌర్య పాప తన తండ్రి చాలా గొప్ప వాడు అని చెప్తూ .. నాకు అమ్మ అయినా నాన్న అయినా మా అమ్మే అంటూ ప్రేమి విశ్వనాధ్ ని చూపిస్తుంది.

Written By:
  • NARESH
  • , Updated On : March 1, 2024 / 07:11 PM IST
    Follow us on

    Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ ముగిసి ఏడాది అవుతుంది. సీరియల్ ఎండింగ్ లో దీనికి సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ ముందే హింట్ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే కార్తీకదీపం .. ఇది నవ వసంతం అంటూ సీరియల్ ప్రోమో వదిలారు. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. సీరియల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఈ కార్తీక దీపం పార్ట్ 1 కి కొనసాగింపా లేక కొత్త కథ? ఆర్టిస్టులు వాళ్లే ఉంటారా లేక కొత్తవాళ్లతో ప్లాన్ చేశారా? ఇలా అనేక సందేహాలు ఆడియన్స్ లో మదిలో మెదులుతున్నాయి.

    బుల్లితెరపై దాదాపు ఆరేళ్ల పాటు నంబర్ వన్ సీరియల్ గా కార్తీకదీపం నిలిచింది. ఇందుకు ప్రధాన కారణం ఇందులో పాత్రలే కాదు .. తన అద్భుతమైన ప్రతిభ తో ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేసిన దర్శకుడు కాపుగంటి రాజేంద్ర.రికార్డు టీఆర్పీ సాధించి జాతీయ స్థాయి దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు కాపుగంటి రాజేంద్ర. అయితే ఈ సీక్వెల్ కి సంబంధించిన ప్రోమో వచ్చేయడంతో ఈ సీరియల్ కి దర్శకుడు ఎవరు అని సెర్చ్ చేస్తున్నారు.

    తాజాగా కార్తీకదీపం 2 సీరియల్ షూటింగ్ ప్రారంభం అయింది. ఇందుకు సంబంధించిన లొకేషన్ స్పాట్ నుంచి నిరుపమ్ ఓ వీడియో షేర్ చేశాడు. కాగా లొకేషన్ స్పాట్ లో మెగా ఫోన్ పట్టుకుంది దర్శకుడు కాపుగంటి రాజేంద్ర కాదు. వేరే దర్శకుడు కనిపిస్తున్నారు. ప్రోమో పరిశీలిస్తే ట్యాగ్ లైన్ కి తగ్గట్టే ఇది నవ వసంతం అని చెప్పిన విధంగా పూర్తిగా కొత్త కథ అని అర్థమవుతుంది. ఇక ఈ కొత్త కథకు దర్శకుడు కూడా మారిపోయారు అని తెలుస్తుంది. కార్తీకదీపం 2 నుంచి డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర ను తప్పించారట.

    కార్తీక దీపం 2ను నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నాడని స్పష్టం అయింది. అయితే ఈ ప్రోమోలో ఎక్కడా వంటలక్క, డాక్టర్ బాబు ప్రస్తావన తేలేదు. సౌర్య పాప తన తండ్రి చాలా గొప్ప వాడు అని చెప్తూ .. నాకు అమ్మ అయినా నాన్న అయినా మా అమ్మే అంటూ ప్రేమి విశ్వనాధ్ ని చూపిస్తుంది. నాన్న కూడా ఉంటే బాగుంటుంది అంటూ ఇంటి ఓనర్ గా ఉన్న నిరుపమ్ తో చెబుతుంది. కాగా ఆ ఇంట్లో పనిమనిషిగా ప్రేమి విశ్వనాథ్ ని చూపించారు. ప్రోమో చూసిన సీరియల్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు సీరియల్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.