Japan Trailer : జపాన్ ట్రైలర్ రివ్యూ: దొంగతనాల్లో తిమింగలంగా మారిన బుల్లి చేప, మైండ్ బ్లాక్ చేస్తున్న కార్తీ క్యారెక్టరైజేషన్!

లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో కార్తీ ఢిల్లీగా, సూర్య రోలెక్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే...

Written By: NARESH, Updated On : October 29, 2023 3:29 pm
Follow us on

Karthi Japan (Telugu) Official Trailer : భిన్నమైన సబ్జక్ట్స్ ఎంచుకోవడంలో కార్తీ తన మార్క్ చూపిస్తున్నాడు. ఆయన గత చిత్రం సర్దార్. సీక్రెట్ ఏజెంట్, పోలీస్ పాత్రల్లో ఆకట్టుకున్నాడు. సర్దార్ తెలుగు, తమిళ భాషల్లో విజయం సాధించింది. ఈసారి జపాన్ అంటూ గజదొంగగా ప్రేక్షకులను పలకరించనున్నాడు. దర్శకుడు రాజు మురుగన్ తెరకెక్కించిన జపాన్ మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. దీంతో ప్రొమోషన్స్ షురూ చేశారు. నేడు జపాన్ మూవీ ట్రైలర్ విడుదల చేశారు.

ట్రైలర్ కార్తీ వాయిస్ ఓవర్ తో మొదలైంది. ట్రైలర్ పరిశీలిస్తే బాల్యంలోనే దొంగగా మారిన జపాన్ అనే యువకుడి కథ ఇది. హైదరాబాద్ నగర నడిబొడ్డులో గల నగల దుకాణంలో రూ. 200 కోట్ల విలువైన ఆభరణాలు చోరీకి గురవుతున్నాయి. ఈ దొంగతనానికి పాల్పడిన జపాన్ ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తుంటారు. రాష్ట్రవ్యాప్తంగా కల్లోలం రేపిన ఈ కేసు రాజకీయ చర్చకు దారి తీస్తుంది.

అసలు ఎవరీ జపాన్? దొంగగా ఎందుకు మారాడు? దొంగతనాలు చేయడం వెనుక మోటివ్ ఏమిటీ? కాజేసిన సొమ్ము ఏం చేస్తున్నాడు? అనేది ఈ చిత్ర కథ కావచ్చు. దొంగగా కార్తీ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, లుక్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. కార్తీ గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని చెప్పొచ్చు. అను ఇమ్మానియేల్ హీరోయిన్ గా నటిస్తుంది. సునీల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ రోల్ చేస్తున్నాడు. ట్రైలర్ మొత్తంగా ఆకట్టుకుంది. అంచానాలు పెంచేసింది.

డ్రీం వారియర్స్ పతాకం పై ఎస్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. జపాన్ దీపావళి కానుకగా విడుదల కానుంది. జపాన్ మూవీతో కార్తీ మరో హిట్ కొట్టడం ఖాయం అని చెప్పొచ్చు. జపాన్ ట్రైలర్ విడుదల ఈవెంట్లో కార్తీపై అన్నయ్య సూర్య ప్రశంసలు కురిపించడం విశేషం. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో కార్తీ ఢిల్లీగా, సూర్య రోలెక్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే…