https://oktelugu.com/

మహిళా ఉద్యోగులకు అ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. ఆరు నెలలు సెలవులు..?

కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం యడియూరప్ప అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళా ఉద్యోగులకు శుభవార్తలు చెప్పారు. ప్రభుత్వ సంస్థలలో పని చేస్తున్న మహిళా ఉద్యోగినులకు 180 రోజులు చైల్డ్ కేర్ లీవ్ లు ఇచ్చేందుకు ప్రతిపాదనలు చేస్తున్నామని సీఎం తెలిపారు. మహిళలకు సంబంధించిన వేర్వేరు కార్యక్రమాల అమలు కొరకు 37,188 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. Also Read: ఆ ఊర్లో ఆడపిల్ల పుడితే 111 మొక్కలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 8, 2021 / 06:00 PM IST
    Follow us on

    కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం యడియూరప్ప అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళా ఉద్యోగులకు శుభవార్తలు చెప్పారు. ప్రభుత్వ సంస్థలలో పని చేస్తున్న మహిళా ఉద్యోగినులకు 180 రోజులు చైల్డ్ కేర్ లీవ్ లు ఇచ్చేందుకు ప్రతిపాదనలు చేస్తున్నామని సీఎం తెలిపారు. మహిళలకు సంబంధించిన వేర్వేరు కార్యక్రమాల అమలు కొరకు 37,188 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు.

    Also Read: ఆ ఊర్లో ఆడపిల్ల పుడితే 111 మొక్కలు నాటుతారు.. ఎక్కడంటే..?

    ఈరోజు సీఎం యడ్యూరప్ప కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెడుతూ బెంగళూరు సహా ఇతర ప్రాంతాల్లోని అంగన్వాడీలను క్రీచ్‌లుగా మారుస్తున్నట్టు సీఎం ప్రకటించారు. పట్టణాల్లోని వర్కింగ్ ఉమెన్ సౌకర్యం కొరకు ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం అన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో రెండు ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలలో క్రీచ్ లను ఏర్పాటు చేయబోతున్నట్టు ఆయన తెలిపారు.

    Also Read: స్మార్ట్ ఫోన్ కొనేవాళ్లకు శుభవార్త.. ఫ్లిప్ కార్ట్ లో భారీ డిస్కౌంట్లు..?

    రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు ఇప్పటికే మెటర్నిటీ సెలవులను ఇస్తున్నామని.. ఇకపై ఈ సెలవులతో పాటు చైల్డ్ కేర్ సెలవును కూడా ఇస్తామని సీఎం పేర్కొన్నారు. మహిళల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని మహిళలకు ప్రయోజనం చేకూరాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయాలను తీసుకున్నామని యడియూరప్ప అన్నారు. సీఎం తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం మహిళలకు ప్రయోజనం చేకూర్చే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగినులకు, విద్యార్థినులకు మేలు జరిగేలా తీసుకున్న నిర్ణయాలపై ప్రశసంలు వ్యక్తమవుతున్నాయి.