కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అంశం తేలడం లేదు. గత కొన్నేళ్ళుగా కాపులు ఈ రిజర్వేషన్ల కోసం పోరాటం సాగిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన పది శాతం రిజర్వేషన్లలో ఇది శాతం కాపులకు కేటాయించాలంటూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ మంత్రి చేగోండి హరి రామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు అమలు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోలేదు. కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున అమలు చేయలేమంటూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అయితే, తాజాగా సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు అమలు చేయాలంటూ హరి రామ జోగయ్య తరపు న్యాయవాది రాధాకృష్ణ కోర్టుకు విన్నవించారు. సుప్రీంకోర్టులో విచారణ ముగిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వడం లేదంటూ ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఏపీ సీఎం జగన్ కాపుల రిజర్వేషన్లను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇప్పుడు పక్కనున్న కర్ణాటకలో రిజర్వేషన్ల అంశం ఆంధ్రాను కుదిపేస్తోంది. కర్ణాటకలో లాగానే ఏపీ, తెలంగాణలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ముఖ్యంగా ఆంధ్రాలో ఇది ప్రకంపనలు సృష్టితోంది.
ఈడబ్ల్యూఎస్ కోటాలో ఏపీలోని కాపులు 5శాతం కోటాను మాకు రిజర్వ్ చేయాలని కోరుతున్నారు. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.
