Kantara A Legend Chapter-1 First Look Teaser : 2022లో విడుదలైన కాంతార ఒక సంచలనం. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించాడు. కాంతార విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ కొట్టింది. రూ. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసింది. కాంతార తెలుగు హక్కులు నిర్మాత అల్లు అరవింద్ కొనుగోలు చేశారు. ఆయనకు మూడింతల లాభాలు వచ్చాయి. ఒక భిన్నమైన సబ్జెక్టు కి సస్పెన్సు, హారర్, ఎమోషన్ జత చేసి కాంతార తెరకెక్కించారు.
కాంతార క్లైమాక్స్ సీన్ కి విజిల్స్ పడ్డాయి. ఒక్క చిత్రంతో రిషబ్ శెట్టి ఇండియా వైడ్ పాప్యులర్ అయ్యాడు. జనాన్ని అంతగా ఆకట్టుకున్న కాంతార చిత్ర ఫ్రాంచైజీ నుండి మరో చిత్రం అనగానే అంచనాలు ఎక్కడికో చేరాయి. తాజాగా కాంతార ఏ లెజెండ్ చాప్టర్ వన్ టీజర్ అండ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇది కాంతార చిత్రానికి ప్రీక్వెల్ అని సమాచారం.
కాంతార చాప్టర్ 1 లో రిషబ్ శెట్టి ఏమి చెప్పనున్నాడనే ఉత్కంఠ నెలకొంది. ఇక నేడు విడుదలైన ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ కలిగించింది. రిషబ్ శెట్టి జులపాలు, గడ్డం, చేతిలో త్రిశూలం కలిగి ఉన్నాడు. కండలు తిరిగిన శరీరం అంతగా రక్తపు మరకలు ఉన్నాయి. ఆ చూపులో తీక్షణత భయపెట్టేలా ఉంది. మొత్తంగా కాంతార చాప్టర్ 1 టీజర్ అంచనాలు పెంచేసింది.
కాంతార సక్సెస్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో కాంతార చాప్టర్ 1 తెరకెక్కించారు. విజువల్స్, మేకింగ్ చాలా రిచ్ గా ఉండే అవకాశం కలదు. కాంతార చాప్టర్ 1 వచ్చే ఏడాది విడుదల కానుంది. కెజిఎఫ్ నిర్మాత విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందించారు. కాంతార చిత్రానికి ఆయన అందించిన మ్యూజిక్ ఆయువు పట్టుగా నిలిచింది. రిషబ్ శెట్టి మరోసారి మ్యాజిక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.