
Amigos Twitter Talk: బింబిసార విజయంతో కళ్యాణ్ రామ్ జోరుమీదున్నారు. సోసియో ఫాంటసీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన బింబిసార గత ఏడాది సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కొత్త దర్శకులను, వైవిధ్యమైన సబ్జెక్స్ ఎంచుకుంటూ విజయాలు సాధించే ప్రయత్నం చేస్తున్నాడు. బింబిసార ప్రయోగాత్మకంగానే తెరకెక్కింది. ఆయన లేటెస్ట్ రిలీజ్ అమిగోస్ సైతం వైవిధ్యమైన చిత్రం. ఎలాంటి రక్తసంబంధం లేని పోలికలు కలిగిన ముగ్గురు వ్యక్తులు కలిస్తే పరిస్థితి ఏంటి? భిన్న నేపధ్యాలు కలిగిన ఒకరి జీవితాలు మరొకరిపై ఎలాంటి ప్రభావం చూపాయి? అనే అంశాలతో అమిగోస్ తెరకెక్కింది.
నిజంగా ఇది కొత్త పాయింట్. గతంలో ఈ పాయింట్ టచ్ చేస్తూ సినిమాలు తెరకెక్కిన దాఖలు లేవు. డ్యూయల్ రోల్ లేదా ట్రిపుల్ రోల్ అంటే దాదాపు కవలలు, రక్త సంబంధీకులు అన్నట్లే చూపిస్తారు. కాబట్టి దర్శకుడు రాజేంద్ర రెడ్డి వినూత్నమైన కథతో వచ్చాడు. కథ కొత్తగా ఉన్నంత మాత్రాన విజయం దక్కదు. దానికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మాత్రమే ఫలితం దక్కుతుంది. మరి రాజేంద్ర రెడ్డి ఆ విషయంలో సక్సెస్ అయ్యాడా అంటే… కొంత మేరకు పర్లేదు.
అమిగోస్ మూవీ ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఆడియన్స్ తమ అభిప్రాయం వెల్లడిస్తున్నారు. అలాగే కొందరు ఫిల్మ్ క్రిటిక్స్ తమ ఒపీనియన్ షార్ట్ రివ్యూగా ఇవ్వడం జరిగింది. అమిగోస్ మూవీ కథ చాలా కొత్తగా ఉంది. అదిరిపోయే యాక్షన్, మెస్మరైజ్ చేసే థ్రిల్లింగ్ అంశాలు ఉన్నాయి. కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ లో అద్భుతం చేశాడు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో వేరియేషన్స్ చూపుతూ చక్కగా హ్యాండిల్ చేశాడు. బాలయ్య సాంగ్ రీమిక్స్ అయిన ‘ఎన్నో రాత్రులు వస్తాయి కానీ’ మరో హైలెట్ పాయింట్.

నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ మెప్పిస్తాయి అంటున్నారు. అమిగోస్ మూవీలో నెగిటివ్ పాయింట్స్ గా ఆడియన్స్ కొన్ని తెరపైకి తెచ్చారు. కథ కొత్తగా ఉన్నప్పటికి దాని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు రాజేంద్ర రెడ్డి పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. పూర్ స్క్రీన్ ప్లే. రొటీన్ సన్నివేశాలు సినిమా స్థాయి తగ్గించాయి. జిబ్రాన్ బీజీఎం నిరాశపరిచింది. టైట్ స్క్రీన్ ప్లేతో ఆసక్తికర సన్నివేశాలు రాసుకొని ఉంటే అమిగోస్ అద్భుతం చేసేదన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు. మొత్తంగా అమిగోస్ డీసెంట్ మూవీ, ఒకసారి చూడొచ్చని ప్రేక్షకుల అభిప్రాయం.
https://twitter.com/14karthikeya/status/1623872638383964160
https://twitter.com/ManofmasseesNTR/status/1623871846348365824
https://twitter.com/ManofmasseesNTR/status/1623867858395738113
#Amigos Average 1st Half!
Interesting concept with a few well executed scenes but the rest is substandard with ineffective BGM.
— Venky Reviews (@venkyreviews) February 10, 2023
