https://oktelugu.com/

Kalki 2898 AD బిగ్ బ్రేకింగ్ : కల్కి 2898 ఏడీ సినిమాలో విలన్ కమల్ హాసన్.. సంచలన విషయం లీక్

ఇక కల్కి సినిమాలో ప్రముఖ హీరో కమల్ విలన్ గా చేస్తున్నాడన్న వార్తనే సంచలనంగా మారింది. దక్షిణాదిలోనే కాదు ఇప్పుడు ఇండియాలోనే టాప్ హీరో.. విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు కమల్. అలాంటి కమల్ ఏకంగా ప్రభాస్ సినిమాలో విలన్ గా చేస్తున్నాడన్న వార్తనే సంచలనంగా మారింది.

Written By:
  • NARESH
  • , Updated On : July 24, 2023 / 07:27 PM IST
    Follow us on

    Kalki 2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కే అదే.. కల్కి 2898 ఏడీ టీజర్ ఇటీవల విడుదలై అందరికీ గూస్ బాంబ్స్ తెప్పించింది. విష్ణువు 10వ అవతారంగా దేవుడిగా ప్రభాస్ నటిస్తుండగా.. ఇందులో విలన్ ఎవరన్నది ఇప్పటివరకూ రివీల్ చేయలేదు. కానీ ఇప్పుడు కమల్ హాసన్ ఆ విషయాన్ని బయటపెట్టి సంచలనం రేపారు.

    కల్కి సినిమా టీజర్ ను తాజాగా అమెరికాలోని శాన్ డియాగో కామికాన్ ఈవెంట్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కోసం ప్రభాస్ తోపాటు రానా, కమల్ హాసన్, దర్శకుడు నాగ్ అశ్విన్ లు అమెరికా వచ్చారు. ఈ సందర్భంగా కల్కి మూవీలో తాను నటిస్తున్నాడంటే ప్రభాస్ సైతం నమ్మలేదని కమల్ హాసన్ సంచలన నిజాన్ని బయటపెట్టారు.

    ఈ కథను ఎందుకు ఓకే చేశానో కూడా కమల్ బయటపెట్టారు.కొన్ని వేల ఏళ్ల నుంచి మేం పురాణాలను ఫాలో అవుతున్నాం.. ఆ పురాణాల గొప్పతనాన్ని చాటి చెప్పడం కోసమే నాగ్ అశ్విన్ ఈ మూవీ తీస్తున్నాడు. నేనూ ఇందులో సంతోషంగా భాగమయ్యా.. ఒక సినిమాకు హీరో ఎంత ముఖ్యమో విలన్ కూడా అంతే అవసరం.. అందుకే విలన్ గా కనిపించడానికి ఓకే చేశానని కమల్ తెలిపారు.