Jasmine Price : పూలల్లో అత్యంత సువాసన ఇచ్చేవి మల్లెలు. వేసవి వచ్చిందంటే చాలు.. మల్లెలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. మగువ మనసు ఎప్పుడు మల్లెలలపైనే ఉంటుంది. అందువల్ల వారిని ఇంప్రెస్ చేయడానికి గుప్పుడు మల్లెలు చాలాని కొన్ని సినిమాల్లో డైలాగ్ లను చూశాం. అయితే ఈ వేసవికి మార్కెట్లో మల్లెలు సువాజన వెదజల్లనున్నాయి. కానీ ధరలతో బెంబేలెత్తించనున్నాయి. ఎందుకంటే మల్లెల ధరలు కొండెక్కాయి. ఇప్పటి వరకు మార్కెట్లోకి వచ్చిన మల్లెలు కేజీకి రూ.1200 పలుకుతున్నాయి. దీంతో ఈసారి మల్లెలు కొనుగోలు చేయడం ెలా? అని కొందరు ఆందోళన చెందుతున్నారు. అసలు మల్లెల ధర పెరగడానికి కారణం ఏంటంటే?
ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తాజాగా మల్లెల ధరలు గుబులు పుట్టిస్తున్నాయి. హోల్ సేల్ మార్కెట్లో ఇవి రూ.1000 నుంచి రూ.1200 లతో విక్రయించి రికార్డు సృష్టించారు. డిమాండ్ కు సరిపడా మల్లెలు లేకపోవడంతోనే వీటి ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఏపీలోని కృష్ణ జిల్లా మైలవరంలో మల్లెలు విరబూస్తాయి. వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచి ఎక్కువగా తరలుతాయి. అయితే ఈసారి మైలవరం చంద్రగూడెంలో కేజీ మల్లెలను రూ.1200 లతో విక్రయించారు.
ఏపీలో మిచాంగ్ తుఫాను అతలాకుతలం చేసింది. ఈ తుఫాను కారణంగా చాలా పంటలు ధ్వంసమయ్యాయి. కొందరు రైతులు ఇప్పటికీ కోలుకోవడం లేదు. ఏ పంట చూసినా దిగుబడి రావడం లేదు. దీంతో మార్కెట్లో పలు పంటల కొరత ఏర్పడింది. మొన్నటి వరకు టామాట ధరలు చుక్కలనంటాయి. నిన్న వెల్లుల్లి ధరలు ఆకాశానికి ఎగబాటాయి. ఇప్పుడు మల్లెపూల ధరలు సైతం కొండెక్కి కూర్చున్నాయి. అయితే ముందు ముందు ఇంకే ధరలు పెరుగుతాయోనని అంటున్నారు.
ప్రతీ వేసవిలో మార్కెట్లోకి విరివిగా వస్తాయి. కానీ ఈసారి మాత్రం ఆ అవకాశం లేదని అంటున్నారు. ఒకవేళ కనిపించినా అత్యధిక ధరతో విక్రయించే అవకాశం ఉంది. దీంతో వినియోగదారులు ఈసారి మల్లెల సువాసన కరువవనుందా? అని అనుకుంటున్నారు. అయితే ఈ ధరలు ఇలాగే కొనసాగుతాయా? లేదా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కొందరు మాత్రం ఇంతకంటే పెరుగుతాయని అంటుండగా..మరికొందరు మాత్రం అలాంటిదేమీ లేదని అంటున్నారు.