Homeఆంధ్రప్రదేశ్‌Rayapati Aruna Interview: ఆమె మాటలు.. జనసేన నుంచి దూసుకొచ్చే ‘అరుణ’ అస్త్రాలు..

Rayapati Aruna Interview: ఆమె మాటలు.. జనసేన నుంచి దూసుకొచ్చే ‘అరుణ’ అస్త్రాలు..

Rayapati Aruna Interview: జనసేన.. వారసత్వ రాజకీయాలకు దూరంగా మహిళలకు, యువతకు ప్రాధాన్యతనిచ్చే పార్టీగా మారింది. అందులో సామాన్యులు కూడా పార్టీ కోసం పాటు పడి అగ్రస్థానంలోకి ఎదిగిన వారున్నారు. మిగతా పార్టీల్లా కాకుండా కష్టపడి జనసేనను ఓన్ చేసుకొని పార్టీ కోసం పనిచేస్తున్నారు. అందులో ఒకరే అరుణ.

2014లో సామాన్య కార్యకర్తగా మొదలైన ఆమె ప్రస్థానంలో జనసేనలో అంచలంచెలుగా ఎదిగి ఇప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎదిగారు. దీనివెనుక అకుంఠిత దీక్ష, పట్టుదలతోపాటే ఏ పార్టీలో కూడా లేని స్వేచ్ఛ జనసేనలో ఉంది. అందుకే ఒక మహిళ రాష్ట్ర స్థాయికి ఎదిగారు. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేనాని పవన్ సిద్ధాంతాలకు ఆకర్షితులై రాజకీయాల్లోకి వచ్చారు జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ. రాజకీయాలంటే ఇష్టం.. సాధించాలన కృషితో జనసేనలో పనిచేశారు. ప్రకాశం జిల్లాలో సామాన్య కార్యకర్తగా చేరిన ఆమె.. ఆ తర్వాత జనసేన ప్రకాశం జిల్లా జాయింట్ సెక్రటరీగా.. అనంతరం రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎదిగారు.

2014లో జనసేనలో చేరిన అరుణ.. అనంతరం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు టీడీపీ కోసం పనిచేశారు. 2018లో టీడీపీ-బీజేపీలతో తెగదెంపులు చేసుకున్న జనసేనాని పవన్ తోపాటు బయటకు వచ్చారు. సోషల్ మీడియాలో జనసేన తరుఫున యాక్టివ్ పాలిటిక్స్ నడిపారు. ఎంతో మందిని ప్రభావితం చేశారు. కరోనాకు ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేసిన జనసేన కార్యకర్తలపై దాడులకు నిరసనగా అరుణ ‘అరుణపతాకమై’ నిలిచారు. వారికి అండగా రాష్ట్రమంతా తిరిగారు. వైసీపీ దాష్టీక చర్యను ఎండగట్టారు.

ఇంటింటికి జనసేనను తీసుకెళ్లారు అరుణ. ఈక్రమంలోనే జనసేనలో ఆమె వాయిస్ బలంగా వినిపించారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు జనసేన భావాజాలాన్ని తీసుకెళ్లారు. అధికార వైసీపీని చీల్చిచెండాడారు. పవన్ కళ్యాణ్ ను తిట్టేవారికి గట్టి కౌంటర్లు ఇచ్చారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ దృష్టిలో పడ్డారు. ఆమెకు అందలం ఎక్కించారు పవన్.జనసేన అధికార ప్రతినిధిగా నియమించారు. ఇప్పుడు అరుణ అంటే జనసేన తరుఫున ఒక ఫైర్ బ్రాండ్. ఆమె మాట్లాడితే ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే. ఆమె వాయిస్ ఒక గంభీరమని చెప్పొచ్చు. అరుణ టీవీ డిబేట్స్, ప్రెస్ మీట్లలో జనసేన భావజాలాన్ని.. ప్రత్యర్థుల విమర్శలకు గట్టి కౌంటర్లు ఇస్తూ ముందుకెళుతున్నారు.

ఈ క్రమంలోనే అరుణ ఆశలు, ఆశయాలు.. జనసేనలో ఆమె అడుగులు.. ఎటువైపు వెళతాయన్న దానిపై ‘ఓకే తెలుగు’ స్పెషల్ ఇంటర్వ్యూను కింది వీడియోలో చూడొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

  1. […] Corona 4th Wave: కరోనా కథ ముగిసినట్లే అని సంబరపడిపోతున్నా కొత్తకొత్త వేరియంట్లతో ప్రజలను కంగారు పెడుతూనే ఉంది. తాజాగా కొత్త వేరియంట్ పుట్టడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వేరియంట్లలో సబ్ వేరియంట్లతో కరోనా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. దీంతో ఏం చేయాలో తోచని పరిస్థితి. ఈ నేపథ్యంలో జూన్ నుంచి నాలుగో దశ ప్రారంభం కానుందని హెచ్చరికలు వస్తున్న సందర్భంలో కొత్త వేరియంట్ ప్రమాదకరంగా మారనుంది. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని చెబుతున్నారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular