Janasena 10th annual day meeting : జనసేనాని పవన్ కళ్యాణ్ మౌనాన్ని ఎందుకు ఆశ్రయిస్తున్నారు? కొద్దిరోజులుగా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? అది వ్యూహంలో భాగమా? లేకుంటే కొత్త ఆలోచన చేయబోతున్నారా? అసలు ఆయన వచ్చే ఎన్నికల్లో ఎవరితో కలవబోతున్నారు? ఆయన మనసులో ఉన్న మాటేమిటి? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.
ఎక్కడ చూసినా ఇదే చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి మరి కొద్దిరోజుల్లో క్లారిటీ రానున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావ సభలో కీలక ప్రకటన వెల్లడించే చాన్స్ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో తన రాజకీయ ప్రయాణంపై పవన్ ఫుల్ క్లారిటీ ఇచ్చే సమయం ఆసన్నమైందని అటు పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి.
తన మదిలో ఉన్న ఆలోచనను పవన్ బయటపెట్టేందుకు మచిలీపట్నం వేదిక కానుందని తెలుస్తుండడం పొలిటికల్ వర్గాల్లో హీట్ పెంచుతోంది.
జనసేన ఆవిర్భావలో పవన్ ఏం దిశానిర్ధేశం చేయబోతున్నాడు? ఎలా ఉండబోతుందన్న దానిపై ‘రామ్ ’గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.
