Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమా బ్రో రివ్యూలు చూసిన తర్వాత ఫ్యాన్స్ కు పూనకాలే పూనకాలు.. సినిమాలకు రాజకీయాలకు సంబంధం లేకున్నా మామూలు పరిస్థితుల్లో సినిమా వేరు.. రాజకీయం వేరు. అయితే ఇప్పుడు రెండూ కలిసిపోయాయి.
భీమ్లా నాయక్, వకీల్ సాబ్ తో పోలిస్తే బ్రో సినిమాలో రాజకీయాలు లేవు. కానీ దీన్ని వైసీపీ పాటించడం లేదు. ఇప్పటికే పవన్ సినిమాలను అడ్డుకున్నారు. పవన్ సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా.. సినిమా టికెట్ల ధరలు తగ్గించేసి నానా యాగీ చేసి వైసీపీ సర్కార్ అడ్డుకుంటోంది. పవన్ సినిమాపై వైసీపీ చేసిన రాజకీయం అంతా ఇంతాకాదు.
జనసేన పూర్తిగా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంది. జనసేనకు అన్నీ పవనే.. పవన్ సినిమాల్లో, రాజకీయాల్లో మాట్లాడేది అంతా జనసేనపై ప్రభావం చూపిస్తోంది. పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ..సాక్షాత్తూ ముఖ్యమంత్రినే భీమ్లానాయక్ మూవీకి అడ్డంకులు సృష్టిస్తే ఇది రాజకీయం కాక ఇంకేమిటి? అన్నది వైసీపీ ఆలోచించాలి.
ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ బ్రో సినిమా హిట్ కొట్టడంతో జనసైనికుల్లో రెట్టింపైన ఉత్సహం వెల్లివిరుస్తోంది.. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ రాజకీయంపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.