Jana Sena Veeramahila : ‘వాసిరెడ్డి’కి తడాఖా చూపిన జనసేన వీర మహిళలు

అదే సమయంలో గత మే నెలలో వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్మన్ పదవీకాలం ముగిసింది అన్న వార్తలు వచ్చాయి.ఇటువంటి తరుణంలో వాసిరెడ్డి పద్మ వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది.

Written By: Dharma, Updated On : July 31, 2023 8:50 pm
Follow us on

Jana Sena Veeramahila : జనసేన వీర మహిళలు కదం తొక్కారు. ఉగ్రరూపం దాల్చారు. పవన్ కళ్యాణ్ పై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అనుచిత వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తంగా మారింది. వాసిరెడ్డి పద్మ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అత్యున్నత పదవిలో ఉన్న ఆమె వైసీపీ నాయకురాలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఆమె తీరు మార్చుకోవాలని హితవు పలికారు. కాగా జనసేన వీర మహిళలను పోలీసులు ఉక్కుపాదంతో అణచివేసే ప్రయత్నం చేశారు. అక్రమంగా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు . దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

వాలంటీర్ వ్యవస్థ పై జనసేన అధినేత పవన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వాలంటీర్ల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పవన్ కళ్యాణ్ కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది పెను వివాదానికి దారి తీసింది. రెండు వారాల్లో మహిళా కమిషన్కు సమాధానం చెప్పాలని పవన్ కు నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. పవన్ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మహిళా కమిషన్ స్పందించడం ఏమిటి అన్న ప్రశ్న ఉత్పనమైనది. అదే సమయంలో గత మే నెలలో వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవీకాలం ముగిసింది అన్న వార్తలు వచ్చాయి.ఇటువంటి తరుణంలో వాసిరెడ్డి పద్మ వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది.

కానీ వాసిరెడ్డి పద్మ దూకుడు తగ్గించలేదు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల వాడు వీడు అంటూ వ్యక్తిగత హననానికి పాల్పడ్డారు. దీనిపై జనసేన వీర మహిళలు తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు. సోమవారం మహిళా కమిషన్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. వాసిరెడ్డి పద్మకు వినతిపత్రం అందించే ప్రయత్నం చేశారు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. ఉక్కు పాదం మోపే ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జనసేన వీర మహిళలు కాకినాడ రమాదేవి, సౌజన్య తదితర నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అటు పోలీసుల అరెస్టుల పర్వం కొనసాగుతున్నా.. జనసేన వీర మహిళలు ఎక్కడా వెనక్కి తగ్గలేదు.