https://oktelugu.com/

AP CM Jagan : విశాఖకు జగన్ షిఫ్ట్.. అప్పటి నుంచే పాలన

సీఎం వస్తే కచ్చితంగా మంత్రులు కూడా రావాల్సి ఉంటుంది. అందుకే మంత్రుల కార్యాలయ భవనాల అన్వేషణలో అధికారులు పడ్డారు. అటు సీఎంఓ అధికారులు బస చేసేందుకు వీలుగా కొన్ని భవనాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే రాజధాని అధికారికంగా రాకున్నా.. సీఎం క్యాంప్ ఆఫీస్ తో ఆ వాతావరణాన్ని తేవాలని జగన్ ఆరాటపడుతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 6, 2023 / 12:06 PM IST

    CM Jagan- NATA Convention 2023

    Follow us on

    AP CM Jagan : ఏపీ సీఎం జగన్ మంచి ముహూర్తం చూసుకొని విశాఖలో అడుగుపెట్టనున్నారు. విశాఖ నుంచి పాలన సాగించనున్నారు. అన్నీ కుదిరితే అక్టోబర్ 24 నాడు.. విజయదశమి సందర్భంగా విశాఖ క్యాంప్ కార్యాలయ భవనంలో అడుగుపెట్టనున్నట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి.ఇప్పటికే క్యాంపు కార్యాలయానికి సంబంధించి భవనం ముస్తాబౌతోంది. రుషికొండ సమీపంలో అద్భుతమైన భవనానికి మెరుగులు దిద్దుతున్నారు. సీఎంఓ నుంచి కీలక అధికారులు వచ్చి ఎప్పటికప్పుడు పనులను పరిశీలిస్తున్నారు. అటు భద్రతా సిబ్బంది సైతం ట్రైల్ రన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. రిషికొండ పరిసర ప్రాంతాల్లో భద్రతాపరంగా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

    సీఎం కొత్త క్యాంప్ ఆఫీసుకు కూత వేటు దూరంలో పోలీస్ అవుట్ పోస్ట్ సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం సీఎం క్యాంప్ ఆఫీసే కాకుండా.. పూర్తిస్థాయిలో నివాసం సైతం ఇక్కడే కొనసాగుతుందని వైసిపి వర్గాలు చెబుతున్నాయి.

    నాలుగు నెలల కిందట శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టు శంకుస్థాపన చేసిన సమయంలో సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేశారు. సెప్టెంబర్ నుంచి…విశాఖ నుంచి పాలన సాగిస్తామని చెప్పుకొచ్చారు. ఇటీవల మంత్రి గుడివాడ అమర్నాథ్, ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ వైవీ సుబ్బారెడ్డి సైతం పదేపదే ఇదే విషయాన్ని ప్రకటిస్తున్నారు. కానీ ఉత్తరాంధ్ర ప్రజలు లైట్ తీసుకుంటూ వచ్చారు. గతంలో గడువుల మీద గడువులు విధించడమే ఇందుకు కారణం.

    అయితే ఇప్పుడు సీఎం జగన్ విశాఖ రావలసిన అనివార్య పరిస్థితి ఎదురైంది. ఎన్నికలకు పట్టుమని 10 నెలల వ్యవధి కూడా లేదు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని నిలబెట్టారని జగన్ సర్కార్ పై అపవాదు ఉంది. మరోవైపు రాజధానుల కేసు సుప్రీంకోర్టులో ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశం లేదు.అందుకే వీలైనంత త్వరగా విశాఖకు మకాం మార్చాలని జగన్ భావిస్తున్నారు. రు షికొండలో నూతన కార్యాలయ భవనం చూస్తుంటే..జగన్ అక్టోబర్లో విశాఖ తప్పకుండా వస్తారని అంతా భావిస్తున్నారు.

    సీఎం వస్తే కచ్చితంగా మంత్రులు కూడా రావాల్సి ఉంటుంది. అందుకే మంత్రుల కార్యాలయ భవనాల అన్వేషణలో అధికారులు పడ్డారు. అటు సీఎంఓ అధికారులు బస చేసేందుకు వీలుగా కొన్ని భవనాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే రాజధాని అధికారికంగా రాకున్నా.. సీఎం క్యాంప్ ఆఫీస్ తో ఆ వాతావరణాన్ని తేవాలని జగన్ ఆరాటపడుతున్నారు.