https://oktelugu.com/

Jagan vs Pawan : పవన్ పై ప్రస్టేషన్ లో జగన్.. తీవ్ర వ్యాఖ్యలు

జగన్ లో ప్రస్టేషన్ అధమ స్థాయికి చేరుకుంది. తన తాజా ఆరోపణలకు చూపిస్తున్న కారణం వలంటీరు వ్యవస్థపై ఆరోపణలు. అయితే దీనిపై జగన్ స్పష్టమైన సమాధానం చెప్పలేదు. పవన్ లేవనెత్తిన ప్రశ్నలు, అనుమానాలను నివృత్తి చేయలేదు. కానీ వలంటీర్ల క్యారెక్టర్లపై మాట్లాడతారా? అంటూ కొత్త లింకు పెట్టి కామెంట్స్ చేశారు.

Written By:
  • NARESH
  • , Updated On : July 21, 2023 3:27 pm
    Jagan vs Pawan kalyan

    Jagan vs Pawan kalyan

    Follow us on

    Jagan vs Pawan : ఏపీ సీఎం జగన్ అసలు సిసలు రాజకీయానికి తెరతీశారు. రాజకీయ ప్రత్యర్థులపై డోసు పెంచారు. ఈ క్రమంలో కాస్తా అతిగానే స్పందించారు. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ ను మళ్లీ వ్యక్తిగతంగా టచ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ వైవాహిక జీవితం వరకూ ప్రస్తావిస్తూ వచ్చిన జగన్…పవన్ వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడంటూ కొత్త అస్త్రాన్ని అందుకున్నారు. తిరుపతి జిల్లా ధర్మవరంలో నేతన్న నేస్తం బటన్ నొక్కిన జగన్ పవన్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. తాను పరమ పవిత్రంగా భావించే వలంటీరు వ్యవస్థపై విమర్శలు చేస్తావా అంటూ జగన్ కన్నెర్ర జేయడం విశేషం.

    గత నెలరోజులుగా పవన్ వారాహి యాత్రలో ప్రభుత్వంపై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ నే టార్గెట్ చేసుకున్నారు. మిస్టర్ జగన్ అంటూ సంభోదిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఏపీని నేరాంధ్రప్రదేశ్ గా మార్చారంటూ… జగ్గూభాయ్ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని ఆరోపించారు. జగన్ సతీమణి భారతి గురించి ప్రస్తావిస్తూ… మీరు సోదర సమానులని…జగన్ కాస్తా మర్యాద నేర్పించండి అంటూ సూచించారు. ఇటువంటి విమర్శలను జీర్ణించుకోని జగన్ నేరుగా కౌంటర్ అటాక్ చేశారు. లోబరచుకోవడం.. పెళ్లి చేసుకోవడం… నాలుగేళ్లకు విడిచిపెట్టడం అంటూ మరోసారి వ్యక్తిగత హననానికి దిగారు. అంతటితో ఆగకుండా వివాహ బంధంలో ఉండగానే..వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారని ఆరోపించడం కాస్తా అతిగా కనిపిస్తోంది.

    అయితే జగన్ లో ప్రస్టేషన్ అధమ స్థాయికి చేరుకుంది. తన తాజా ఆరోపణలకు చూపిస్తున్న కారణం వలంటీరు వ్యవస్థపై ఆరోపణలు. అయితే దీనిపై జగన్ స్పష్టమైన సమాధానం చెప్పలేదు. పవన్ లేవనెత్తిన ప్రశ్నలు, అనుమానాలను నివృత్తి చేయలేదు. కానీ వలంటీర్ల క్యారెక్టర్లపై మాట్లాడతారా? అంటూ కొత్త లింకు పెట్టి కామెంట్స్ చేశారు. నెలరోజులుగా పవన్ జగన్ సర్కారును డ్యామేజ్ చేయగలిగారు. ప్రజల్లో ఒక రకమైన ఆలోచన తీసుకురాగలిగారు. ఇప్పుడు ఏపీ సమాజంలో వలంటీర్ల పాత్రపై బలమైన చర్చ జరుగుతోంది. ఇటువంటి సమయంలో అందరి దృష్టి మరల్చేందుకే పవన్ పై వ్యూహాత్మకంగా జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.

    ఎన్నడూ లేనివిధంగా రాజకీయంగా జగన్ ను పవన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. బీజేపీతో ఇన్నాళ్లూ నెరిపిన రాజకీయాలను చెక్ చెబుతూ పవన్ ఢిల్లీ స్నేహాన్ని అందుకున్నారు. అటు ఢిల్లీ పెద్దలు సైతం పవన్ ను ప్రాధాన్యతనివ్వడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నిరకాలుగా ప్రయత్నించిన తన రాజకీయ ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబును పవన్ వెనుకేసుకురావడం, బీజేపీతో కలవాలని ప్రయత్నాలు చేస్తుండడంతో జగన్ లో ప్రస్టేషన్ కు కారణం. అందుకే నేరుగా కౌంటర్ అటాక్ చేయడం ప్రారంభించారు. అయితే దీనిపై పవన్ ఏ స్థాయిలో రిప్లయ్ ఇస్తారో చూడాలి.