YCP – BJP : అక్కడ స్నేహం.. ఇక్కడ వైరం.. ఇదెట్లా జగన్?

ఇది బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్న జనసేనకు, టీడీపీకి కూడా ఓ రకంగా డిఫెన్స్ లో పడేసే యోచనే. జగన్ ఢిల్లీలో స్నేహం చేస్తూ.. ఇక్కడ బీజేపీతో వైరం నటిస్తూ కాగల కార్యాలను సాధించుకుంటున్నారు.

Written By: NARESH, Updated On : July 27, 2023 7:16 pm
Follow us on

YCP – BJP : రాజధానిలో స్నేహం.. ఆంధ్రా గల్లీలో వైరం.. ఇదేం స్ట్రాటజీనో అంతుబట్టకుండా ఉంది. జగన్ అవసరాల కోసం బీజేపీతో స్నేహం చేస్తోంది. బీజేపీ కూడా రాజ్యసభలో బిల్లు పాస్ కోసం వైసీపీ స్నేహాన్ని అందుకుంటోంది. అయితే ఏపీలో వీరిద్దరి స్నేహం మిత్రులపై ప్రభావం చూపిస్తున్నాయి. బీజేపీతో ఏపీలో జనసేన పొత్తులో ఉంది. రెండూ కలిసి వెళ్లాలని అనుకుంటున్నాయి. కానీ ప్రతీ విషయంలో బీజేపీతో అంటకాగుతూ ఏపీలో పొత్తులనే వైసీపీ ప్రభావితం చేస్తోంది. తాజాగా అదే పనిచేసింది.

సీఎం జగన్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభలో బోటాబోటీగా ఉన్న బీజేపీకి మద్దతుగా నిలబడ్డారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లులను పాస్ చేయించుకునేందుకు బీజేపీ ఎన్డీఏ కూటములతో చర్చిస్తోంది. ఈ క్రమంలోనే అడగకుండానే వైసీపీ మద్దతు ఇవ్వడం విశేషం. ఎందుకంటే జగన్ అవసరాలు అలాంటివి మరీ. బీజేపీ కూడా జగన్ తో కయ్యానికి దిగడం లేదు. అవసరార్థం వాడేసుకుంటోంది.

జాతీయ రాజధాని ఢిల్లీ ప్రభుత్వ (సవరణ) బిల్లు 2023పై వైసీపీ సంచలన స్టాండ్ బయటపెట్టింది. జాతీయ రాజధాని అధికార యంత్రాంగాన్ని కేంద్రానికి అప్పగించే బిల్లుపై భారతీయ జనతా పార్టీకి పార్టీ మద్దతు ఇస్తున్నట్టు వైఎస్‌ఆర్‌సి ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి విజయసాయి రెడ్డి ప్రకటించారు. మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని కూడా వ్యతిరేకించిన ఆయన ఓటింగ్ సమయంలో వైఎస్సార్సీపీ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తుందని స్పష్టం చేశారు..

వైసీపీ నిర్ణయం రాజ్యసభలో బీజేపీకి పెద్ద ఉపశమనం కలిగించింది. ఎందుకంటే వైసీపీకి చెందిన తొమ్మిది మంది సభ్యులు బిల్లుకు ఓటు వేస్తారు. 237 మంది పార్లమెంటు సభ్యుల రాజ్యసభలో ఓటు వేయాల్సి ఉండగా, ప్రతిపక్ష కూటమికి వచ్చే 108 ఓట్లకు వ్యతిరేకంగా ఎన్‌డిఎకు ఇప్పుడు 123 ఓట్ల మెజారిటీ వచ్చింది. వైసీపీ మద్దతుతో ఈ బిల్లులో బిజెపి నెగ్గుతుంది. ఈ క్రమంలోనే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా బీజేపీ పని చేయదు. ఇది బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్న జనసేనకు, టీడీపీకి కూడా ఓ రకంగా డిఫెన్స్ లో పడేసే యోచనే. జగన్ ఢిల్లీలో స్నేహం చేస్తూ.. ఇక్కడ బీజేపీతో వైరం నటిస్తూ కాగల కార్యాలను సాధించుకుంటున్నారు.