Jagan Tollywood: ఈనెల 10న అంటే రేపే టాలీవుడ్ పెద్దలు చిరంజీవి నేతృత్వంలో ఏపీ సీఎం జగన్ ను కలవబోతున్నారు. జగన్ కు సన్మానం చేసి ఆయనను కూల్ చేసి ఇక తమ సమస్యలను పరిష్కరించుకునే బాటలో పడ్డారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ పెద్ద చిరంజీవితోపాటు ఈసారి దర్శకులు రాజమౌళి, కొరటాల శివ తోపాటు అగ్రహీరోలు నాగార్జున మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి ప్రముఖులు జగన్ తో భేటికి వస్తున్నట్టు సమాచారం. ఇక అన్ని వైపుల నుంచి వస్తున్న విమర్శలతో జగన్ సర్కార్ కూడా ఈ సమూస్యను తేల్చితేనే బెటర్ అని భావిస్తోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ పెద్దలతో జగన్ కీలక భేటికి నిర్ణయించారు. ఈ క్రమంలోనే రేపే జగన్ తో టాలీవుడ్ పెద్దలు భేటి కాబోతున్నారు.

ఈసారి సమావేశంలో అటు ప్రభుత్వానికీ.. ఇటు చిత్రసీమకూ మధ్య ఉన్న గ్యాప్ సమసిపోతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. దాంతోపాటు ప్రభుత్వం కూడా టాలీవుడ్ కు వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్న సంకేతాలు అందుతున్నాయి.
ఆన్ లైన్ టికెటింగ్, టికెట్ రేట్లు తగ్గిస్తూ జగన్ సర్కార్ జీవో విడుదల చేయడంతో సమస్య మొదలైంది. ఇప్పుడు ఆ జీవోలోని సవరించడానికి ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తోంది. అలాగని మరీ పెద్ద సినిమాకు గేట్లు ఎత్తేయకుండా కనిష్టం.. గరిష్టం అని రేట్లు ఫిక్స్ చేయబోతున్నట్టు సమాచారం. ఆ రేట్లు టాలీవుడ్ కు ఊరటనిచ్చేలా ఉండబోతున్నాయని తెలుస్తోంది.
జగన్ సర్కార్ తొలుత ఇచ్చిన జీవోల్లో బీ, సీ సెంటర్లలో టికెట్ రేట్లు మరీ తక్కువగా ఉన్నాయి. ఆ రేట్లు పూర్తిగా సవరించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు బెనిఫిట్ షోలకు సైతం జగన్ అనుమతించబోతున్నారని సమాచారం. వాటి ధరలు, టికెట్ రేట్లు గురించి ఇప్పటికే టాలీవుడ్ కి, ప్రభుత్వానికి మధ్య అవగాహన కలిగిందని.. ఆ తర్వాతే ఈ భేటిలో అందరూ ఓకే అనుకొని ప్రకటించబోతున్నారని సమాచారం.
ఇక తాజాగా సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ‘నంది’ అవార్డుల అంశం లేవనెత్తారు. చాలా ఏళ్లుగా నంది అవార్డులను సినిమా ఫీల్డ్ కు ఏపీ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఈ అవార్డుల గురించి ప్రకటించబోతున్నారనితెలుస్తోంది. 2021 వరకూ నంది అవార్డులను ప్రకటించేస్తారని తెలుస్తోంది.
[…] […]