Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో పాటు రాజకీయాలకు కూడా సమానంగా ప్రాధాన్యత ఇస్తారన్న విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు సినిమాలను సైతం ఆపేసి రాజకీయాలపైనే తన దృష్టి అంతా పెట్టారు చిరంజీవి. అయితే ఎన్నికలలో మెజారిటీ సీట్లు గెలవకపోవడంతో, తిరిగి సినిమాలపై తన దృష్టిని మళ్లించుకున్నారు. అలా అని పూర్తిగా రాజకీయాలకు ఎప్పుడు దూరం కాలేదు చిరంజీవి. అలా అని ఆయన ఈ మధ్య ప్రభుత్వాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయలేదు. కానీ ఎన్నో రోజుల తరువాత ఆయన ప్రభుత్వం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అసలు విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ 200 డేస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ సెలబ్రేషన్స్.. వాల్తేరు వీరయ్య మూవీ యూనిట్, పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో జరిగాయి. రవితేజ కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో సినిమాతో పాటు చిరంజీవి రాజకీయాల గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి.
ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నటీనటుల రెమ్యునరేషన్ పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయని.. డిమాండ్, ఆదరణ ఉన్నప్పుడు నటీనటులకు పారితోషికాలు ఎక్కువే ఉంటాయని అన్నారు. ప్రత్యేక హోదా గురించి, ప్రాజెక్టుల గురించి, రోడ్ల నిర్మాణం గురించి ఆలోచించాలని.. మీలాంటి వాళ్ళు వీటి మీద దృష్టి పెట్టి డెవలప్ చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారని కామెంట్స్ చేశారు.
పేదవారికి కడుపు నిండే పథకాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి వాటి గురించి ఆలోచించాలి అంటూ సూచించారు. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడడం.. దీన్నేదో పెద్ద సమస్యలా చూపించడం సరికాదని అన్నారు. ఏపీ సమస్యలపై మాట్లాడాలంటూ చిరంజీవి పరోక్షంగా సూచించారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలంటూ ఏపీ సర్కార్ కు హితవు పలికారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఇక చీఫ్ మినిస్టర్ జగన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
చిరంజీవి ఇన్నాళ్లు జగన్ పై సానుకూలంగా ఉండి ఇప్పుడు రివర్స్ అయ్యేసరికి జగన్, ఏపీ మంత్రులు బరెస్ట్ అవుతున్నారు. తాజాగా బొత్స సత్యనారాయణ సైతం రంగంలోకి దిగి చిరంజీవికి కౌంటర్ ఇచ్చారు. ఇద్దరూ కాపు కులస్థులే కావడంతో చిరంజీవిపై బొత్సను జగన్ ప్రయోగించినట్టు తెలుస్తోంది.
ఇక చిరంజీవి తదుపరి సినిమా బోళా శంకర్ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది.