https://oktelugu.com/

Jabardasth Avinash : జబర్ధస్త్ ముక్కు అవినాష్ బిడ్డ మరణం.. కన్నీళ్లు తెప్పిస్తోన్న పోస్ట్

ఈ సమయంలో తమను ఒంటరిగా వదిలేయాలని.. మరిన్ని వివరాలను లేదా వ్యాఖ్యానించవద్దని వారిని కోరాడు. ఈ నష్టం యొక్క బాధ అలాగే ఉంటుందన్నారు. అవినాష్ తన శ్రేయోభిలాషులు ఈ కష్ట సమయంలో నిరంతర మద్దతు ఇవ్వాలని అభ్యర్థించాడు.

Written By:
  • NARESH
  • , Updated On : January 7, 2024 / 05:28 PM IST
    Follow us on

    Jabardasth Avinash : స్టార్ ఫిగర్‌గా మారిన మాజీ జబర్దస్త్ కమెడియన్ , బిగ్ బాస్ కంటెస్టెంట్ అవినాష్ అభిమానుల గుండె పగిలే వార్త చెప్పారు. హృదయ విదారక విషాదాన్ని పంచుకున్నారు.

    జబర్దస్త్‌లో వినోదభరితమైన స్కిట్ లతో బిగ్ బాస్‌లో కంటెస్టెంట్ గా కామెడీ పంచి పాపులర్ అయ్యాడు ముక్కు అవినాష్. తాజాగా తన భార్య గురించి షాకింగ్ వార్త బయటపెట్టాడు.

    అవినాష్ భార్య తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అభిమానులతో చురుకుగా ఉంటారు. అందులో అవినాష్ కు సంబంధించిన వీడియోలు పెడుతుంటారు. రెండు సంవత్సరాల క్రితం అవినాష్ వీరిద్దరి వివాహం జరిగింది. ఈ జంట ఒక యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించారు. తమ జీవితాల్లోని వివిధ అంశాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. బిగ్ బాస్ లో తన సత్తా చాటుతూ సంచలనంగా మారిన అవినాష్ షో తర్వాత కూడా తన ప్రతిభను చాటుకుంటూనే ఉన్నాడు.

    గత సంవత్సరం ఏప్రిల్‌లో తమ మొదటి బిడ్డను పొందడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు అవినాష్ తెలిపారు. తమ ప్రయాణాన్ని డాక్యుమెంట్ గా కూడా తీశారు. గర్భం దాల్చినప్పటి నుండి క్షణాలను వీడియోలో పంచుకున్నారు. సన్నిహితుల మధ్య సాంప్రదాయ శ్రీమంతం వేడుకతో సహా అన్నీ గ్రాండ్ గా తీశారు.

    అయితే తాజాగా అవినాష్ ఓ విషాదకర వార్తను బయటపెట్టాడు. తమ పుట్టబోయే బిడ్డను కోల్పోయినట్టు అవినాష్ బాధాతప్త హృదయంతో తెలిపారు. గుండెలు పగిలే వార్తను పంచుకున్నాడు. ఆత్రంగా ఎదురు చూసినా తల్లిదండ్రులు కాలేకపోయారనే బాధను వ్యక్తం చేశారు. తన అభిమానుల నుండి తనకు , తన భార్యకు లభించిన మద్దతుకు అవినాష్ కృతజ్ఞతలు తెలిపాడు.

    ఈ సమయంలో తమను ఒంటరిగా వదిలేయాలని.. మరిన్ని వివరాలను లేదా వ్యాఖ్యానించవద్దని వారిని కోరాడు. ఈ నష్టం యొక్క బాధ అలాగే ఉంటుందన్నారు. అవినాష్ తన శ్రేయోభిలాషులు ఈ కష్ట సమయంలో నిరంతర మద్దతు ఇవ్వాలని అభ్యర్థించాడు.