https://oktelugu.com/

Garisenda Tower: ప్రమాదంలో వాలు టవర్‌.. ఇటలీ ప్రభుత్వం హై అలర్ట్‌!

వాలు టవర్‌ను 14వ శతాబ్దంలో 150 అడుగుల ఎత్తుగా నిర్మించారు. అప్పటి నిర్మాణ నైపుణ్యానికి ఈ టవర్‌ నిదర్శనం. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా అద్భుతంగా నిర్మించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 2, 2023 / 02:59 PM IST

    Garisenda Tower

    Follow us on

    Garisenda Tower: లీనింగ్‌ టవర్‌.. దీనినే పీసా టవర్‌.. వాలు టర్‌ అని కూడా అంటారు. పీసా టవర్‌ పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రపంచ అరుదైన కట్టడాల్లో పీసా టవర్‌ కూడా ఒకటి. ఇటలీలోని బోలోగ్నాలో ఉన్న ఈ టవర్‌ నిర్మించి దాదాపు వెయ్యేళ్లు పూర్తయినట్లు అంచనా.. కొంత వాలి ఉండడం కూడా దిని ప్రత్యేకత. అత్యంత ఎత్తయిన ఈ టవర్‌ ఇప్పుడు బాగా వాలిపోయింది. కూలిపోయే ప్రమాదం ఉందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఇటలీ ప్రభుత్వం హై అలర్ట్‌ ప్రకటించింది.

    14వ శతాబ్దంలో నిర్మాణం..
    వాలు టవర్‌ను 14వ శతాబ్దంలో 150 అడుగుల ఎత్తుగా నిర్మించారు. అప్పటి నిర్మాణ నైపుణ్యానికి ఈ టవర్‌ నిదర్శనం. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా అద్భుతంగా నిర్మించారు. అయితే 4 డిగ్రీల కోణంలో ఒరిగినట్లుగా ఉండడంతో దీనిని సరిచేయడానికి ప్రయత్నించగా అది మరో డిగ్రీ వంగిపోయిందట. దీంతో అలాగే వదిలేశారని చరిత్ర. ఈ అద్భుతమైన టవర్‌ను ఇటలీ ప్రభుత్వం కాపాడుతూ వస్తోంది. పురాతన టవర్‌ సంరక్షణకు అనేక చర్చలు కూడా చేపట్టారు. కానీ, ఇప్పుడు టవర్‌ విపరీతంగా వంగి ఉంది. పౌర రక్షణ ప్రణాళికను అమలులోకి తీసుకురావాలని నగర అధికారులను బలవంతం చేసింది.

    కూలిపోయే అవకాశం..
    పురాతన భవనం కావడం, శిథిలావస్థకు చేరుకోవడంతో కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. కూలిన సమయంలో చుట్టూ ఉన్న భవనాల నష్టం తగ్గించడానికి ప్రాణ నష్టం జరుగకుండా చూసుకోవడానికి టవర్‌ చుట్టూ మెటల్‌ కార్డన్‌ ఏర్పాటు చేస్తున్నారు. కూలడం వల్ల ఏర్పడే శి«థిలాలను తరలించడానికి కూడా ఏర్పాట్లు చేసినట్లు సిటీ కౌన్సిల్‌ తెలిపింది.

    మోగిన డేంజర్‌ బెల్స్‌..
    2019 నుంచి సైట్‌ను పర్యవేక్షించిన సైంటిఫిక్‌ కమిటీ ఈ హెచ్చరికను జారీ చేసింది. వారు పురాతన టవర్‌ కదలికలను కొలిచే సెన్సార్‌లను ఏర్పాటు చేశారు. అక్టోబర్‌ 2023లో రీడింగ్‌లు అలారం బెల్స్‌ను ప్రేరేపించాయని కమిటీ పేర్కొంది. బేస్‌ టవర్‌ ‘క్రషింగ్‌ కంప్రెషన్‌ ఊహించని విధంగా, వేగంగా ఉందని తెలిపింది. అందుకే ‘హై అలర్ట్‌’ హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపింది. బేస్‌లో ఉపయోగించిన రాళ్లలోని పగుళ్లు పైన ఉన్న ఇటుకలకు విస్తరించవచ్చని అంచనా వేసింది. ఈ నివేదిక వచ్చిన వెంటనే, పౌర అధికారులు టవర్‌ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మూసివేశారు. రహదారులు కూడా బ్లాక్‌ చేశారు.