IT Layoffs : ఐటీ కంపెనీల కత్తెర: ఉద్యోగులు లబోదిబో

ప్రపంచమే కాదు దేశీయ ఐటీ రంగానికి ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. భవిష్యత్‌ డిమాండ్‌పై అనిశ్చితి మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో, కంపెనీలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వ్యయ నియంత్రణపై దృష్టి సారిస్తున్నాయి.

Written By: NARESH, Updated On : August 2, 2023 8:39 pm
Follow us on

IT Layoffs : ఫస్ట్‌ తారీఖు.. వేతన జీవులకు అది ఒక ఏమోషన్‌.. గవర్నమెంటో, ప్రైవేటో.. చేసే ఉద్యోగానికి లభించే ప్రతిఫలం అందుకుంటున్నప్పుడు ఉద్యోగుల్లో ఏదో తెలియని ఆనందం ఉంటుంది. వారి వారి స్థాయిని బట్టి, నిర్వహించే విధులను బట్టి వేతనాలు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఐటీలో ఇంతకు మించి అనే లాగా వేతనాలు ఉంటాయి. వారంలో ఐదు రోజులు మాత్రమే పని.. మిగతా రెండు రోజులు సెలవులు.. వద్దన్నా క్రెడిట్‌ కార్డలు ఇచ్చే బ్యాంకులు.. రుణాలు ఇచ్చే సంస్థలు.. ఇలా చెప్పుకొంటూ పోతే ఐటీ కొలువుకు ఉండే వెసలబాట్లు మాములువి కావు. కానీ, ఇప్పుడా ఆ పరిస్థితులు లేవు. గతమెంతో ఘనంగా ఉన్న వారి పరిస్థితి ఇప్పుడు అత్యంత అధ్వానంగా మారింది. ఇదీ సరిపోదనట్టు ఇప్పుడు కంపెనీలు కత్తెరకు పని చెబుతున్నాయి. దీంతో ఉద్యోగుల కళ్ల వెంట నీళ్లు కారుతున్నాయి.

ప్రపంచమే కాదు దేశీయ ఐటీ రంగానికి ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. భవిష్యత్‌ డిమాండ్‌పై అనిశ్చితి మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో, కంపెనీలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వ్యయ నియంత్రణపై దృష్టి సారిస్తున్నాయి. దేశీయ ఐటీ రంగంలో ప్రస్తుతం ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. భవిష్యత్‌ డిమాండ్‌పై అనిశ్చితి మబ్బులు కమ్ముకున్నాయి. దాంతో, కంపెనీలు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వ్యయ నియంత్రణపై దృష్టిసారిస్తున్నాయి… కొత్త ఉద్యోగుల నియామకంలోనూ ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాయి. దీంతో టాప్‌ త్రీ ఐటీ కంపెనీల్లోని(ఆదాయ పరంగా) మొత్తం ఉద్యోగుల సంఖ్య జూన్‌ త్రైమాసికం నాటికి 10 శాతం మేర తగ్గింది. గతంతో పోలిస్తే ఉద్యోగుల వలసలు తగ్గినప్పటికీ నికర సంఖ్య తగ్గుముఖం పట్టింది. క్రితం సంవత్సరంలో ఇదే కాలానికి ఈ పది కంపెనీలు నికరంగా 3 శాతం మందిని ఉద్యోగంలో చేర్చకున్నాయి. మార్చితో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే, గత మూడు నెలల్లో టాప్‌ టెన్‌లోని ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గింది. నాలుగు కంపెనీల్లో మాత్రం స్వల్పంగా పెరిగింది.

ఇక, దేశంలో నంబర్‌ వన్‌ ఐటీ కంపెనీ టీసీఎస్‌ నికర ఉద్యోగులు 4 శాతం పెరిగారు. ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌ నికర నియామకాలు 3 శాతం పెరిగాయి. ఇన్ఫోసిస్‌లో 2 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, ఎల్‌ టీ ఐ మైండ్‌ ట్రీ, ఎంఫసీస్‌లో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రస్తుత త్రైమాసికం(జూలై నుంచి సెప్టెంబరు)తో పాటు మరింత కొంతకాలం ఐటీలో ఉద్యోగుల సంఖ్య పెరిగే అవకాశాలు కన్పించడం లేదు. భవిష్యత్‌పై ఎటువంటి భరోసా ఇవ్వడం లేదు. కోవిడ్‌ సమయంలో ఐటీ కంపెనీలు అవసరానికి మించి నియామకాలు చేపట్టాయి. కానీ, భారత ఐటీ రంగానికి కీలకమైన అమెరికాకు మాంద్యం ముప్పు పొంచి ఉండటంతో క్లయింట్ల ఆదాయ, వ్యయాలపై అనిశ్చితి నెలకొంది. ఈనేపథ్యంలో దేశీయ ఐటీ కంపెనీలు లాభాల మార్జిన్లు కాపాడుకునేందుకు ఉద్యోగులను తగ్గించుకో వడం లేదా ఉన్నవారితోనే గట్టెక్కించడంపైనే దృష్టి సారించాయి.