CM KCR Self Goal : కేసీఆర్ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడా? అనిపిస్తోంది. ఒకనాడు చంద్రబాబుకు పట్టిన గతే.. ఈరోజు కేసీఆర్ కు పట్టబోతోంది. తెలంగాణ సెంటిమెంట్ పోయి భారత సెంటిమెంట్ వచ్చేసింది. కాలం కలిసివచ్చినంత కాలం కేసీఆర్ అంత రాజకీయ చాణక్యుడు లేడు. ఇవాళ కేసీఆర్ పరిస్థితి అంతే ఉంది. తను ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు.

బీజేపీపై భయంతో.. మోడీ మీద కసితో కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేస్తున్నాడు తప్పితే మరేం లేదని అర్థం చేసుకోవచ్చు. జాతీయ పార్టీ పెట్టాలి.. మోడీకి సమాన స్థాయిలోకి రావాలనే ఉద్దేశంతో తప్పుల మీద తప్పులు చేస్తున్నారు.
ఇవాళ మోడీ దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యంత పాపులర్ నేత. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో ఉంటే.. ప్రపంచానికి భారత్ ఆశాకిరణంలా ఉంది. అలాంటి భారత్ ను లీడ్ చేస్తున్న మోడీకే ఈ ఘనత దక్కుతోంది. మోడీని అవమానించిన చంద్రబాబుకు ఏం గతి పట్టిందో అందరికీ తెలిసిందే. కానీ చంద్రబాబుకు తప్పుడు సలహాలు ఇచ్చి ఎన్నికల్లో మాత్రమే మోడీని ఎదురించాడు.
మోడీ,చంద్రబాబులు సమకాలీకులు.. కానీ కేసీఆర్ అలా కాదు.. మోడీపై ద్వేషం, కలహాలు తెచ్చుకొని ఎవరి బ్రెయిన్ తోనే అరువు తెచ్చుకొని జాతీయ పార్టీ పెట్టాలని ముందుకెళుతున్నాడు.
మోడీ జాతీయ పార్టీలో లీడర్. ఆ పార్టీకి దేశవ్యాప్తంగా నెట్ వర్క్ ఉంది. దాన్ని లీడ్ చేయడం సులవం. కానీ తెలంగాణ తప్పితే కేసీఆర్ కు వేరే రాష్ట్రంలో అసలు నెట్ వర్క్ లేదు. మరి ఎలా కేసీఆర్ జాతీయ స్థాయిలో విస్తరిస్తాడన్నది అందరికీ ప్రశ్న. కేసీఆర్ ఎక్కడ నుంచి ఎక్కడికి వెళుతున్నాడు? జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కు పట్టే గతి ఏంటి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింద చూడొచ్చు.