Project K : ‘ప్రాజెక్ట్ K’ 2000 సంవత్సరాల కాలం నాటి స్టోరీనా..? వింటుంటే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి!

అతను ప్రస్తుత కాలం లోకి అడుగుపెట్టిన తర్వాత ఈ భూమి మీద ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి..?, దుష్ట శక్తుల నుండి 800 సంవత్సరాల తర్వాత అవతరించే శ్రీ మహావిష్ణువు కల్కి ని ప్రస్తుత కాలానికి తీసుకొచ్చి ఇక్కడి ప్రజలను దుష్టశక్తుల నుండి ఎలా రక్షించారు అనేది ఈ సినిమా స్టోరీ లైన్. వింటుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి

Written By: Vicky, Updated On : July 21, 2023 9:05 am
Follow us on

Project K : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ప్రాజెక్ట్ K ‘ చిత్రానికి సంబంధించిన టీజర్ ని నేడు తెల్లవారుజామున విడుదల చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ  చిన్న గ్లిమ్స్ వీడియో ని చూసిన తర్వాత ఈ చిత్రం హాలీవుడ్ సూపర్ హీరో మూవీస్ కి ఏమాత్రం తీసిపోని విధంగా అనిపించింది. ఐరన్ మ్యాన్ , బ్యాట్ మ్యాన్ మరియు సూపర్ మ్యాన్ తరహా పాత్ర ఇందులో ప్రభాస్ పోషించినట్టు అర్థం అవుతుంది.

ఈ భూమిని చీకటి రాజ్యం గా చేసి, దుష్ట శక్తులు ఏలుతూ ప్రజలను నరకయాతన పెడుతుంటారు. వీళ్ళ నుండి ఈ ప్రపంచాన్ని కాపాడే సూపర్ హీరో గా ప్రభాస్ ఈ గ్లిమ్స్ వీడియో లో కనిపించాడు. ఇన్ని రోజులు ప్రాజెక్ట్ K అంటే ఏమిటి అనే విషయం పై సోషల్ మీడియా లో ఒక రేంజ్ ట్రెండ్ జరిగింది.

అయితే ఇన్ని రోజులు కొనసాగిన ఈ చర్చ కి నేడు తెరపడింది. ప్రాజెక్ట్ K లో ‘K’  అంటే కల్కి అని ఈరోజు అర్థం అయ్యింది. ఈ సినిమాని భవిష్యత్తు మరియు వర్తమానం మధ్య జరుగుతుందని తెలుస్తుంది. ఎన్నో వేల క్రితం నాడు జరిగిన మహాభారత కురుక్షేత్ర సంగ్రామం కాలానికి ఈ సినిమా స్టోరీ వెళ్తుందని సమాచారం. అప్పట్లో శ్రీ కృష్ణుని చే శాపగస్తుడైన అశ్వద్ధామ కురూపి రూపం లో ఇంకా జీవించే ఉంటాడు.

అతను ప్రస్తుత కాలం లోకి అడుగుపెట్టిన తర్వాత ఈ భూమి మీద ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి..?, దుష్ట శక్తుల నుండి 800 సంవత్సరాల తర్వాత అవతరించే శ్రీ మహావిష్ణువు కల్కి ని ప్రస్తుత కాలానికి తీసుకొచ్చి ఇక్కడి ప్రజలను దుష్టశక్తుల నుండి ఎలా రక్షించారు అనేది ఈ సినిమా స్టోరీ లైన్. వింటుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి కదూ..?, ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండి. ఈ చిత్రం లో ప్రభాస్ తో పాటుగా అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ వంటి దిగ్గజాలు కూడా నటిస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.