Pawan vs YCP : పవన్ విషయంలో వైసిపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా? జగన్ వర్సెస్ పవన్ అన్న రీతిలో వ్యవహరిస్తోందా? తద్వారా టిడిపిని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోందా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. బ్రో సినిమాలో తన క్యారెక్టర్ ను అవమానకరంగా చూపించారని మంత్రి అంబటి రాంబాబు ఫైరయ్యారు. పవన్ కళ్యాణ్ పై సినిమా తీస్తానని.. దానికి తాళి ఎగతాళి.. నిత్య పెళ్లి కొడుకు.. డ్రగ్స్, మందు అన్న రీతిలో పవన్ చూపిస్తానని అంబటి కౌంటర్ ఇచ్చారు.
అయితే అలా అంబటి ప్రకటించారో? లేదో? జనసైనికులు ర్యాగింగ్ ప్రారంభించారు. తాము కూడా అంబటి రాంబాబు సినిమా తీస్తామని ప్రకటించారు. దానికి యస్ యస్ యస్ పేరు కూడా పెట్టారు. సందులో సంబరాల రాంబాబు అని క్లారిటీ ఇచ్చారు. సుకన్య క్యారెక్టర్ కోసం ఓ హీరోయిన్ ని రెడ్ లైట్ ఏరియాలో వెతుకుతున్నామని..కానీ దొరకడం లేదని.. ఎంత ఖర్చైనా బ్యాంకాక్ నుంచి తీసుకొస్తామని సెటైర్లు వేస్తున్నారు. మరికొందరైతే సీరియస్ గానే సినిమా తీస్తామని చెబుతున్నారు. ఈ విషయంలో చాలామంది రాంగోపాల్ వర్మలు బయటకు వస్తున్నారు.
అయితే ఒకరిపై ఒకరు సినిమాలు తీయగలరా? అది వర్క్ అవుట్ అవుతుందా? లేదనే సమాధానం వినిపిస్తోంది.ఒక వ్యూహాత్మక దాడి తప్పించి.. అంతకుమించి ఏమీ లేదు. అయితే వైసీపీ నుంచి పవన్ పై అదే పనిగా విమర్శలు వస్తుండడం మాత్రం పక్కా వ్యూహాత్మకమేనని తేలుతోంది. ప్రధాన ప్రతిపక్షం టిడిపి కంటే జనసేన ను బలంగా చూపాలన్నదే అధికార పక్షం లక్ష్యం. తద్వారా టిడిపి బలాన్ని తగ్గించి.. జనసేన బలాన్ని పెంచి.. ఆ రెండు పక్షాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలన్నదే వైసిపి అభిమతం. పొత్తులు ఉన్నా.. లేకపోయినా.. తద్వారా ఒక రకమైన భిన్న వాతావరణాన్ని క్రియేట్ చేయాలన్నదే అధికారపక్షం టార్గెట్. అందుకే అదే పనిగా.. పవన్ ను,జనసేన సైనికులను రెచ్చగొడుతున్నారు.