IPL 2024 : క్రికెట్ లో వెన్నుపోట్లకు ఎక్కువ అవకాశం ఉంటుందంటారు. దానిని నిజం చేసే సంఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. మిగతా జట్లతో పోలిస్తే భారత జట్టులో ఇలాంటివి ఎక్కువగా జరిగాయి అంటారు క్రీడా విశ్లేషకులు. త్వరలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ముంబై జట్టుకు సంబంధించిన ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఇది వాస్తవమా? కాదా? అనే విషయం పక్కన పెడితే.. దాని వెనుక ఉన్న వ్యక్తి అటువంటి వాడా? అనే అనుమానం సగటు క్రికెట్ క్రీడాభిమానిలో కలుగుతోంది.
త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్ కోసం అన్ని జట్లు సిద్ధమయ్యాయి. కొన్ని జట్లు కెప్టెన్ లను మార్చాయి. మరికొన్ని జట్లు అలాగే ఆటలోకి దిగుతున్నాయి. ఇప్పటికే ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూ ఆటగాళ్లకు శిక్షణ ఇస్తున్నాయి. అయితే ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుపొందిన ముంబై ఇండియన్స్ కు ఈసారి కెప్టెన్ మారా. గుజరాత్ టైటాన్స్ గట్టు నుంచి హార్దిక్ పాండ్యా ముంబైకి కెప్టెన్ గా వచ్చాడు. వాస్తవానికి ముంబై జట్టును విజయవంతమైన జట్టుగా మార్చడంలో గత కెప్టెన్ రోహిత్ శర్మ కృషి ఎనలేనిది. అతడి ఆధ్వర్యంలో ముంబై జట్టు ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచి 2023 వరకు తిరుగులేని రికార్డు కలిగి ఉండేది. 2023లో చెన్నై జట్టు కప్ గెలవడం ద్వారా ముంబై రికార్డును సమం చేసింది. అనూహ్యంగా రోహిత్ శర్మను కెప్టెన్ పోస్ట్ నుంచి పక్కకు తప్పించడంతో విమర్శలు చెలరేగుతున్నాయి. మరోవైపు తనను తప్పించడం పట్ల రోహిత్ శర్మ ఇప్పటికీ ఆగ్రహం గానే ఉన్నాడు. ఈసారి ఐపీఎల్ ఆడబోనని ట్విట్టర్లో పోస్ట్ చేసి.. మళ్లీ ఏమనుకున్నాడో తెలియదు గానీ డిలీట్ చేశాడు. ఇది ఇలా ఉండగానే తను ఐపీఎల్ ముంబై జట్టుకు కెప్టెన్ అయిన తర్వాత ఇంతవరకు రోహిత్ శర్మతో మాట్లాడలేదని హార్దిక్ పాండ్యా వ్యాఖ్యానించడం విశేషం.
అయితే రోహిత్ కెప్టెన్సీ పోవడం వెనక క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ హస్తం ఉందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి బలం చేకూర్చేలా ఓ నెటిజన్ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ.. దీనిపై ముంబై ఇండియన్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సచిన్ టెండూల్కర్ ముంబై జట్టుకు మెంటర్ గా కొనసాగారు. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం సచిన్ ఇలా చేసి ఉండడని అభిప్రాయపడుతున్నారు. రోహిత్ శర్మకు సచిన్ కు మధ్య విభేదాలు ఎందుకు ఉంటాయని ప్రశ్నిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇటువంటి పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి. వీటన్నింటికీ చెక్ పడాలంటే రోహిత్ నోరు విప్పాల్సిందే. ప్రస్తుతం వెన్ను నొప్పి కారణంగా అతడు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ నొప్పి నుంచి కోరుకుంటేనే అతడు ఐపిఎల్ ఆడే అవకాశం ఉంది. లేకుంటే గతంలో అతడు చెప్పినట్టుగానే ఈసారి ఐపీఎల్ ఆడే అవకాశం ఉండదు. అప్పుడు మరిన్ని పుకార్లు షికార్లు చేస్తుంటాయి. అసలే సోషల్ మీడియా కాలం.. అలాంటి వాటికి అడ్డుకట్ట వేయడం దాదాపు అసాధ్యం.
Few people may call me stupid for this but Sachin Tendulkar ( whom we consider idol ) is the main culprit behind removing Rohit Sharma as MI captain .
[ Thread ] pic.twitter.com/TnzA6tLVr4
— Dev (@time__square) March 18, 2024