IPL 2024 : 90 పరుగులకే 5 కీలక వికెట్లు పోయాయి. అప్పటికే సగం ఓవర్లు కూడా పూర్తయ్యాయి. మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు ఇంకేముంది ఓ 25 లేదా 30 పరుగులు చేసి ఆల్ అవుట్ అవుతుందనుకున్నారు. అప్పుడు వచ్చారు రావత్(48), దినేష్ కార్తీక్ (38).. అగ్నికి ఆజ్యం తోడైనట్టు తుఫాన్ ఇన్నింగ్స్ ఆడారు. ఏకంగా ఆరో వికెట్ కు 96 పరుగులు జోడించారు. ముఖ్యంగా రావత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కుదిరితే ఫోర్, లేకుంటే సిక్స్ అన్నట్టుగా ఆడాడు. అతడి ఇన్నింగ్స్ లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఇక దినేష్ కార్తీక్ కూడా తక్కువ తినలేదు. మూడు ఫోర్లు, రెండు సిక్స్ లతో రావత్ కు అండగా నిలిచాడు. వీరిద్దరి జోడి చెన్నై జట్టులోని ఏ బౌలర్ నూ విడిచిపెట్టలేదు. నాలుగు వికెట్లు తీసిన ముస్తాఫిజూర్ బౌలింగ్ లోనూ దినేష్ కార్తీక్, రావత్ దూకుడుగా ఆడారు.
వీరిద్దరిని విడదీసేందుకు ధోని అనేక ప్రయత్నాలు చేశాడు. గైక్వాడ్ తో ఎప్పటికప్పుడు సంభాషిస్తూ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించాడు. అయినప్పటికీ దినేష్ కార్తీక్, రావత్ జోడి వెనుకడుగు వేయ్యలేదు. దేశ్ పాండే బౌలింగ్ ను వీరిద్దరూ ఒక ఆట ఆడుకున్నారు. తీక్షణ, చాహర్ బౌలింగ్ లోనూ భారీగానే పరుగులు పిండుకున్నారు. వీరిద్దరూ ఆ స్థాయిలో ఆడకుండా ఉండి ఉంటే బెంగళూరు 130 లేదా 140 మధ్యలోనే ప్యాకప్ అయ్యేది.
దినేష్ కార్తీక్ వన్డే క్రికెట్ , టి20 కి రిటర్మెంట్ ప్రకటించిన నాటి నుంచి.. తన స్థాయికి తగ్గట్టుగా ఇన్నింగ్స్ ఆడలేదు. ఐపీఎల్ లో మెరుస్తున్నప్పటికీ.. 17వ సీజన్లో తొలి మ్యాచ్ లో బెంగళూరు తరఫున స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడాడు. రావత్ ఒక్కడి మీద జట్టు భారం మొత్తం వేయకుండా.. తను కూడా స్ట్రైక్ రొటేట్ చేస్తూ వీలు చిక్కినప్పుడల్లా చెత్త బంతులను బౌండరీలు దాటించాడు. సిక్సర్లుగా మలిచాడు. వీరిద్దరు గనక ఒక రెండు ఓవర్ల ముందు వచ్చి ఉంటే బెంగళూరు సునాయాసంగా 200 మార్క్ స్కోర్ కు చేరుకునేది. బెంగళూరు చెన్నై జట్టు ఎదుట 174 పరుగుల లక్ష్యాన్ని ఎదుట నిలిపిందంటే దానికి కారణం దినేష్ కార్తీక్, రావతే. వీరే లేకుంటే బెంగళూరు పరిస్థితి దారుణంగా ఉండేది. వీరిద్దరి వీరోచిత బ్యాటింగ్ పట్ల బెంగళూరు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధోని ఎత్తులను చిత్తులు చేసి.. దూకుడుగా ఆడారంటూ కితాబిస్తున్నారు.
.@RCBTweets Dial 6⃣!
Anuj Rawat & Dinesh Karthik upping the ante! ⚡️ ⚡️
Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE
Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y#TATAIPL | #CSKvRCB | @AnujRawat_1755 | @DineshKarthik pic.twitter.com/c5o3rXdEZf
— IndianPremierLeague (@IPL) March 22, 2024