IPL 2024 : ఐపీఎల్ 2024 కోసం ఇప్పటికే అన్ని టీములు చాలా రకాల కసరత్తులను చేస్తున్నాయి.అయితే టి 20 మ్యాచ్ ల్లో ఎక్కువగా ఆల్ రౌండర్ ప్లేయర్లు తమదైన రీతిలో ప్రతిభను చూపిస్తూ టీం ని విజయ తీరాలకు చేర్చడంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటారు.అలాంటి వాళ్ళని టీం లోకి తీసుకోవడానికి చాలా మంది ఫ్రాంచైజ్ లు ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే అన్ని టీములు కూడా వాళ్ల వైపు ఆల్ రౌండర్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో స్ట్రాంగ్ ఆల్ రౌండర్లని కలిగిన టాప్ 5 టీమ్స్ ఏంటో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
5. లక్నో సూపర్ జాయింట్స్
కే ఎల్ రాహుల్ సారథ్యం లో ఆడుతున్న ఈ టీమ్ లో ప్లేయర్లు అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక ఈ టీమ్ లో ఉన్న ఆల్ రౌండర్లు ఎవరంటే దీపక్ హుడా, కృనాల్ పాండ్యా కైల్ మేయర్స్, స్టోయినిస్ లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్లంతా ఈ టీమ్ ప్లేయింగ్ 11 లో ఉంటారు. కాబట్టి వాళ్ల అవసరం టీమ్ కి ఉంది అనుకున్నప్పుడు తప్పకుండా రాణించి ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపిస్తారని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
4. ముంబై ఇండియన్స్
ముంబై ఇండియన్స్ టీం కి హార్దిక్ పాండ్య రావడంతో ఈ టీం ఆల్ రౌండర్ల విషయంలో చాలా స్ట్రాంగ్ అయిందనే చెప్పాలి.ఇక ఈ టీమ్ లో ఉన్న ఆల్ రౌండర్ల విషయానికొస్తే హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, రోమరీయో షెఫర్డ్, మహమ్మద్ నబీ లాంటి స్టార్ ఆల్ రౌండర్లు ఉన్నారు…
3. సన్ రైజర్స్ హైదరాబాద్
ఈ టీం గత సీజన్ లో పాయింట్స్ టేబుల్ లో లాస్ట్ ప్లేస్ లో ఉన్నప్పటికీ మొన్న జరిగిన మినీ వేలం లో మాత్రం ముగ్గురు స్టార్ ఆల్ రౌండర్లను టీమ్ లోకి తీసుకుంది. దాంతో ఈ టీం స్టార్ ఆల్ రౌండర్లు ఉన్న టీమ్ లా లిస్ట్ లో నెంబర్ 3లో చోటు దక్కించుకుంది. మెయిన్ గా ట్రావిస్ హెడ్, ప్యాట్ కమ్మిన్స్, హసరంగ, ఫిలిప్స్ , వాషింగ్టన్ సుందర్ లాంటి స్టార్ ఆల్ రౌండర్లు ఉన్నారు…
2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
డుప్లేసిస్ సారథ్యం లో ఆడుతున్న ఈ టీమ్ కప్పు కోసం తెగ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళకి ఒక్కసారి కూడా కప్పు రాకపోవడం చాలా బాధకరమైన విషయం అనే చెప్పాలి.ఇక ఈ టీమ్ లో గ్లెన్ మాక్స్ వెల్ లాంటి ఒక అత్యుత్తమమైన ఆల్ రౌండర్ ఉన్నాడు. అలాగే ముంబై టీమ్ నుంచి ఈ సంవత్సరం ట్రేడింగ్ విధానం ద్వారా కెమరూన్ గ్రీన్ ని కొనుగోలు చేశారు అందువల్ల వీళ్ళిద్దరూ కూడా స్టార్ ఆల్ రౌండర్లు కాబట్టి ఈసారి బెంగుళూరు టీమ్ కి అదనపు బలం వచ్చిందనే చెప్పాలి. ఇక వీళ్ల తర్వాత ప్రభుదేశాయి, టామ్ కరణ్ లాంటి వారు కూడా ఉన్నారు…
1.చెన్నై సూపర్ కింగ్స్
ఈ టీంలో చాలామంది ఆల్ రౌండర్లు ఉన్నారు. గత సంవత్సరం ఈ టీమ్ టైటిల్ ని గెలవడమే కాకుండా ఈ సంవత్సరం కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. ఇక ఈ టీమ్ లో ఉన్న ఆల్ రౌండర్లను ఒకసారి చూసుకుంటే రవీంద్ర జడేజా, మిచెల్ సంట్నార్, శివం దుబే, మోయిన్ అలీ, రచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ లాంటి స్టార్ ఆల్ రౌండర్లు ఉన్నారు…
ఇక ఆల్ రౌండర్ల విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ టీం నెంబర్ వన్ పొజిషన్ లో ఉందనే చెప్పాలి.