https://oktelugu.com/

IPL 2024 : ముస్తాఫిజుర్ నాలుగు పడగొట్టినా.. బెంగళూరును డీకే, రావత్ నిలబెట్టారు.. చెన్నై ముందు లక్ష్యం ఎంతంటే?

మ్యాచ్ ప్రారంభంలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ.. చివరి 8 ఓవర్లలో బెంగళూరు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. చెన్నై బౌలర్ల బంతులు గతితప్పడంతో వాటిని ఫోర్లు, సిక్సర్లుగా బెంగళూరు బ్యాటర్లు మలిచారు. ఫలితంగా బెంగళూరు 173 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. చివర్లో కెప్టెన్ గైక్వాడ్ బౌలింగ్ కూర్పు సరిగ్గా చేయకపోవడంతో బెంగళూరుకు వరం లా మారింది. 174 పరుగుల లక్ష్యంతో ప్రస్తుతం చెన్నై జట్టు బరిలోకి దిగింది.

Written By:
  • NARESH
  • , Updated On : March 22, 2024 / 10:58 PM IST

    DK Ravath

    Follow us on

    IPL 2024 :  ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభ మ్యాచ్ అభిమానులకు అసలైన ఆటను పరిచయం చేసింది. నిమిష నిమిషానికి మ్యాచ్ చేతులు మారుతూ సిసలైన కిక్ ఇచ్చింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టు 4 ఓవర్లలోనే 40 పరుగులు చేసింది. ఈ క్రమంలో ముస్తాఫిజుర్ బౌలింగ్ దాటికి డు ప్లెసిస్(35), విరాట్ కోహ్లీ(21), గ్రీన్(18), రజత్ పాటిదార్(0) అవుట్ అయ్యారు. ప్రమాదకరమైన మాక్స్ వెల్(0) చాహర్ బౌలింగ్లో ధోనికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 90 పరుగులకే కీలకమైన ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన బెంగళూరు జట్టును రావత్ (48), దినేష్ కార్తీక్ (38) ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్ కు 96 పరుగులు జోడించారు. వీరిద్దరూ కనుక చెన్నై బౌలర్లను దీటుగా ఎదుర్కొకపోతే బెంగళూరు పరిస్థితి మరో విధంగా ఉండేది.

    చెన్నై బౌలర్లలో ముస్తాఫిజుర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా డు ప్లెసిస్(35), విరాట్ కోహ్లీ(21), గ్రీన్(18), రజత్ పాటిదార్(0) వికెట్లను తీసి బెంగళూరు జట్టును కోలుకోకుండా చేశాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లీ తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో బెంగళూరు అభిమానులు నిరాశలో మునిగిపోయారు. అయితే వారి నిరాశను రావత్, దినేష్ కార్తీక్ దూకుడుగా ఆడి దూరం చేశారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్ కు 96 పరుగులు చేశారు. 48 పరుగులు చేసిన రావత్ రెండు పరుగుల దూరంలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 20 ఓవర్ వద్ద రావత్ ధోని చేతిలో రనౌట్ అయ్యాడు. అయినప్పటికీ బెంగళూరు జట్టును సురక్షిత స్థానంలో నిలిపాడు. అతడి విరోచిత ఇన్నింగ్స్ కు బెంగళూరు 20 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.