https://oktelugu.com/

Sudigali Sudheer- Rashmi Gautam: 9 ఏళ్ల రీల్ బంధం.. మల్లెమాల వద్దనుకున్నా జనం అభిమానిస్తూనే ఉన్నారు

మల్లెమాల ద్వారా సుధీర్ ఈటీవీకి పరిచయం అయ్యాడు. బుల్లితెరలో తిరుగులేని స్టార్ గా ఎదిగాడు. రష్మీ అంతకుముందే పరిచయమైనప్పటికీ.. జబర్దస్త్ ద్వారానే తన ప్రతిభ వెలుగులోకి వచ్చింది.

Written By:
  • Rocky
  • , Updated On : September 5, 2023 / 11:51 AM IST

    Sudigali Sudheer- Rashmi Gautam

    Follow us on

    Sudigali Sudheer- Rashmi Gautam: ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్.. ఎక్స్..ఇలా సోషల్ మీడియా పేజీ ఓపెన్ చేసినా.. ఎక్కడో ఒకచోట వారు కనిపిస్తారు. స్కిట్ రూపంలోనో, డ్యుయట్ గా డాన్స్ వేస్తూనో, ఒకరి మీద మరొకరు పంచ్ లు వేసుకుంటూనో దర్శనమిస్తారు. వాటిని చూస్తే మనకు స్కిప్ చేయాలి అనిపించదు. పైగా అదే పనిగా చూడాలి అనిపిస్తుంది. మొనాటని అనే పదం ఇక్కడ పనికిరాదు. అంతలా తిష్ట వేసుకున్నారు వాళ్ళు. ఒకటా రెండా తొమ్మిది ఏళ్లు గడిచిపోయాయ. అయినా వారి మధ్య కెమిస్ట్రీ అలాగే ఉంది. ఇద్దరి మధ్య ఏమీ లేదని తెలుసు. కానీ బుల్లితెరపై వారిద్దరూ పలకిస్తున్న హావభావాలు అలా ఉన్నాయి మరి. వెనకటికి ఎన్టీఆర్_ సావిత్రి, షారుఖ్ ఖాన్_ కాజోల్, చిరంజీవి_ విజయశాంతి, నాగార్జున_ అమల.. ఇప్పుడు సుధీర్ _రష్మీ. ఇలా చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కొట్టుకుంటారు. తిట్టుకుంటారు. అలుగుతారు. బుజ్జగించుకుంటారు. ఆ తర్వాత కలిసిపోతారు. ఇద్దరు కేవలం స్నేహితులనే తెలుసు, ఇద్దరి మధ్య ఏమీ లేదని తెలుసు. కానీ వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతోంది.

    మల్లెమాల ద్వారా సుధీర్ ఈటీవీకి పరిచయం అయ్యాడు. బుల్లితెరలో తిరుగులేని స్టార్ గా ఎదిగాడు. రష్మీ అంతకుముందే పరిచయమైనప్పటికీ.. జబర్దస్త్ ద్వారానే తన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. ఇందులోకి రాకముందే ఆమెకు పెళ్లయిందని, విడాకులు కూడా తీసుకుందని అంటున్నారు. ఇక సుధీర్ ది కూడా లవ్ ఫెయిల్యూర్. ఏ లెక్కన చూసుకున్నా ఇద్దరికీ ఫాస్ట్ జీవితం ఒక పీడకల. జబర్దస్త్ వేదిక మీద.. ఢీ స్టేజీ మీద ఎన్నో స్కిట్స్ చేశారు. మరెన్నో పాటలకు గంతులు వేశారు. అయినప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. కాలం గడుస్తున్న కొద్దీ మనుషుల ఆలోచనల్లో మార్పు వస్తుంది. వీరిద్దరి విషయంలో ప్రేక్షకులకు ఆ మొనాటని ఫీలింగ్ అనేది రాక పోవడం విశేషం.

    ప్రేక్షకులు చూస్తున్నప్పటికీ.. ఈ జంటకు బ్రహ్మరథం పడుతున్నప్పటికీ.. మల్లెమాల కంపెనీ ఎందుకో దూరం పెట్టింది. జబర్దస్త్ నుంచి సుధీర్ వెళ్లిపోయాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కూడా వెళ్లిపోయాడు. ఢీ నుంచి కూడా వెళ్ళి పోయాడు. రష్మీది సైతం అదే పరిస్థితి. సీన్ కట్ చేస్తే రేటింగ్స్ పడిపోయాయి. మల్లెమాలకు సీన్ అర్ధమైనట్టుంది. ఇటీవల ఈటీవీ బలగం అనే ఒక ప్రోగ్రాం చేసింది. అందులో రష్మీని, సుధీర్ ని తీసుకొచ్చింది. ఇద్దరి మధ్య ఒక డ్యూయట్ పెట్టింది. ఆ ప్రోగ్రాం మొత్తం వీరిద్దరు కేంద్రంగా తీసింది. యూట్యూబ్లో వాటిని పెడితే మిలియన్ వ్యూస్ దాకా వెళ్ళిపోయింది. ఇప్పటికీ ట్రెండింగ్ లోనే సాగుతోంది. మల్లెమాలకు తప్పు తెలిసి వచ్చిందా? ఇకపై వీరిద్దరినీ కొనసాగిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించడం కష్టం…కానీ సుధీర్, రష్మి అంటే మాత్రం తెలుగు వాళ్లకు చాలా ఇష్టం.