https://oktelugu.com/

North Korea: ఉత్తరకొరియా గురించి మూడు మతిపోయే నిజాలు!

ప్రపంచమంతా ఒక క్యాలెండర్‌ అమలు చేస్తుంటే నార్త్‌ కొరియా మాత్రం జూజూ క్యాలెండర్‌ అమలు చేస్తోంది. ఈ క్యాలెండర్‌ నార్త్‌ కొరియా స్థాపకుడు కిమ్‌ ఇల్‌ సంగ్‌ పుట్టినప్పటి నుంచి నడుస్తోంది. ఇప్పుడు ప్రపంచమంతా 2024లో ఉంటే.. కొరియన్లు మాత్రం 113 సంవత్సరం నడుస్తోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 26, 2024 / 03:03 PM IST
    Follow us on

    North Korea: ఉత్తర కొరియా.. చాలా చిన్న దేశం.. ఆ దేశానికి అధ్యక్షుడు కిమ్‌. చైనాకు పొరుగున ఉన్న ఈ దేశం అటు దక్షిణ కొరియాను, ఇటు అగ్రరాజ్యాం అమెరికాను గడగడలాడిస్తున్నాడు. నియంత కిమ్‌ పాలనతో అక్కడి ప్రజలు కూడా నరకం అనుభవిస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. అయినా కిమ్‌ మాత్రం రాజభోగాలు అనుభవిస్తూ పాలన సాగిస్తున్నారు. ప్రజల గురించి పట్టించుకోవడం ఎప్పుడో మానేశాడు. అలాంటి నార్త్‌ కొరియా గురించిన మూడు మతిపోయే నిజాలు తెలుసుకుందాం.

    క్యాలెండర్‌ వేరే..
    ప్రపంచమంతా ఒక క్యాలెండర్‌ అమలు చేస్తుంటే నార్త్‌ కొరియా మాత్రం జూజూ క్యాలెండర్‌ అమలు చేస్తోంది. ఈ క్యాలెండర్‌ నార్త్‌ కొరియా స్థాపకుడు కిమ్‌ ఇల్‌ సంగ్‌ పుట్టినప్పటి నుంచి నడుస్తోంది. ఇప్పుడు ప్రపంచమంతా 2024లో ఉంటే.. కొరియన్లు మాత్రం 113 సంవత్సరం నడుస్తోంది.

    ఇంటర్నెట్‌ బ్యాన్‌..
    ఇక నార్త్‌ కొరియాలో ఇంటర్నెట్‌ బ్యాన్‌ చేశారు. అక్కడ ఎలాంటి నెట్‌వర్క్‌ ఉండదు. స్థానిక అవసరాల కోసం ప్రభుత్వమే ఒక ప్రత్యేక నెట్‌వర్క్‌ను నడుపుతోంది. అక్కడ సోషల్‌ మీడియా, రీల్‌ ఉండవు. అక్కడి నెట్‌వర్క్‌లో చాలా వరకు ఆర్టికల్స్‌ ఉంటాయి. దేశానికి సంబంధించినవే.

    టూరిస్టులపై ఆంక్షలు..
    ఇక నార్త్‌ కొరియన్లు ఏదైనా టూరిస్ట్‌ ప్లేస్‌కు వెళ్లాలంటే గవర్నమెంట్‌ గుర్తించిన ప్లేస్‌కు మాత్రమే వెళ్లాలి. అక్కడ కూడా ఒంటరిగా తిరగకూడదు. గైడ్‌ సహాయంతోనే సందర్శించాలి. ఒకవేళ ఒంటరిగా తిరిగారో ఇక అంతే.

    ఇలా నార్త్‌ కొరియన్లు ప్రత్యేక∙శతాబ్దంలో, ఎలాంటి ఎంటరైన్‌మెంట్‌ లేకుండా, ప్రపంచ దేశాలతో ఇంటర్నెట్‌ సంబంధాలు లేకుండా, టూరిస్ట్‌ ప్లేస్‌లలో ఒంటరిగా ఎంజాయ్‌ చేయకుండా గడుపుతున్నారు.