Kesava Parasaran: కేశవ పరాశరన్.. ఈ పేరు చాలా మందికి తెలిసి ఉండదు. ఒకటి రెండుసార్లు విన్నా మర్చిపోయి ఉంటారు. కానీ, ఆయన అంత ఈజీగా మర్చిపోవాల్సిన వ్యక్తికాదు. అయోధ్యకు భవ్య రాముడు తిరిగి రావడంలో కీలక పాత్ర పోషించిన వకీల్‌సాబ్ ఇతనే. న్యాయవాదిగా 40 ఏళ్లు వాదించి రిటైర్ అయిన ఆయన.. తొమ్మిది పదుల వయసు దాటిన సమయంలో.. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు విన్నపం మేరకు శ్రీరాముడి తరపున వకాల్తా పుచ్చుకున్నారు. అపూర్వమైన జ్ఞాపక శక్తి ఉన్న కేశవ పరాశరన్.. ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా సుప్రీం కోర్టులో అయోధ్యలోని వివాదాస్పద భూమి రాముడిదే అని నిరూపించారు. జగదభిరాముడిని దేశ అత్యున్నత న్యాయస్థానంలో గెలిపించాడు. అయోధ్యలో భవ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కేశవ పరాశరన్ గురించి తెలుసుకుందాం.
రాముడు ఎంచుకున్న న్యాయవాది..
శ్రీరాముడు తాను పుట్టిన స్థలంలో తాను ఏలిన రాజ్యంలో తన స్థలం కోసం 500 ఏళ్లు పోరాటం చేశాడు. కానీ, అనేక మంది బలిదానాలు, త్యాగాల తర్వాత శ్రీరాముడు కేశవ పరాశరన్‌ను తన న్యాయవాదిగా నియమించుకున్నాడు. స్వయంగా రామ భక్తుడు అయిన కేశవ.. రాముడి తరఫున సుప్రీకోర్టులో వాదించి గెలిపించాడు. రాముడని ప్రవచనాలు చేస్తూ కాలం వెల్లదీస్తున్న సమయంలో రామజన్మభూమి ట్రస్టు అయోధ్య రామ జన్మభూమి కేసును వాధించాలని 2008లో కేశవ పరాశరన్‌ను ఆశ్రయించింది. రాముని శ్లోకాలు నిత్యం పఠించే కేశవం ట్రస్టు విజ్ఞప్తిని కాదనలేకపోయారు. ఐదు శతాబ్దాల చరిత్ర ఉన్న రామ జన్మభూమిని సుప్రీంకోర్టులో రాముడిదే అని నిరూపించగలిగారు.
12 మంది లాయర్ల సహకారం..
అయోధ్యలో రామ జన్మభూమి రాముడిదే అని నిరూపించేందుకు వందల సాక్షాలను సుప్రీం కోర్టులో ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో కేశవ పరాశరన్‌కు 12 మంది లాయర్లు సహకరించారు. అయోధ్యలో 40 నుంచి 50 మసీదులు ఉన్నాయని, ముస్లింలు వీటిలో ఎక్కడైనా ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపాడు. శ్రీరాముడు పుట్టిన స్థలం మాత్రం మారదని, హిందువులు అక్కడే రామచంద్రుడిని పూజించాలని భావిస్తున్నారని సుప్రీంలో బలంగా వాదనలు వినిపించారు.
రాముడి ఉనికికి కోర్టుకు చూపించి..
రామ భక్తుడు అయిన కేశవ పరాశరన్ రాముని ఉనికిని, రాముని శక్తిని కోర్టు ముందు ఆవిష్కరించాడు. కేవలం కనిపించే ఆధారాలనే కాకుండా ఇతిహాసాల్లోని సాక్షాలను కూడా కోర్టు ముందు ఉంచారు. అనేక హిందూ గ్రంథాలు, శ్లోకాలను కూడా ఉదాహరణల రూపంలో కోర్టుకు వివరించారు. అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉన్న కేశవన్ చరిత్ర, ఇతిహాసాలు, గ్రంథాల్లోని రాముని గురించిన సాక్షాలను అలవోకగా కోర్టు ముందు ఉంచేవారు. వక్ఫ్ బోర్డు న్యాయవాది రాజీవ్ రతన్ ఎంత అరిచినా కేశవ మాత్రం కూల్‌గా తన వాదనలు వినిపించేవారు. నవ్వుతూ మాట్లాడేవారు. చివరకు అయోధ్యలోని భూమి రాముడు జన్మించిందే అని నిరూపించారు.
చెన్నైలో స్థిరపడ్డారు..
చాలాకాలం సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేసిన కేశవ పరాశరన్ రిటైర్ అయిన తర్వాత చెన్నైలో స్థిరపడ్డారు. రాముని శ్లోకాలు పటిస్తూ కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలో శబరిమలలో మహిళలకు ప్రవేశం వివాదాస్పదం కావడంతో కేశవ మళ్లీ నల్లకోటు వేసుకున్నారు. ఈ క్రమంలోనే రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కేశవను ఆశ్రయించి విజయం సాధించింది. ఇక తీర్పు వచ్చిన రోజు చెన్నైలోని కేశవ ఇంటి వద్ద విచిత్రం జరిగిందట. ఆయన నివాసముండే ప్రాంతంలో ఎన్నడూ కనిపించని కోతులు గుంపులు గుంపులుగా వచ్చాయట. వీటని చూసి చాలా మంది తనను గెలిపించినందుకు ఆ శ్రీరాముడే తన దూతలను కేశవ ఇంటికి పంపించారని భావించారు.
మొత్తంగా 9 పదుల వయసు దాటినా కూడా సుప్రీం కోర్టులో కేశవ తనను గెలిపిస్తాడన్న నమ్మకంతోనే ఆ శ్రీరాముడే ఆయనను తన లాయర్‌గా పెట్టుకున్నారు. శ్రీరాముడి నమ్మకాన్ని కేశవ వమ్ము చేయలేదు.