Vaishnavi Chaitanya: ప్రస్తుతం బేబీ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న హీరోయిన్ వైష్ణవి చైతన్య. కలెక్షన్స్ పరంగా 100 కోట్ల మార్కెట్ కు చాలా దగ్గర లో ఉన్న ఈ సినిమా లో హైలెట్ ఎవరి క్యారెక్టర్ అంటే తప్పకుండా వైష్ణవి డే అని చెబుతారు అందరూ. అందంతో కన్నా కూడా తన అభినయంతో తెలుగుపేక్షకులను ఆకట్టుకుంది ఈ హీరోయిన్. దీంతో సాధారణ ప్రేక్షకుల నుంచి స్టార్ హీరోల వరకు ఈ హీరోయిన్ ని తెగ పొగుడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు వైష్ణవి చైతన్య ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి? సినిమాల్లోకి ఎలా వచ్చింది? అనే విషయాలను ఆరా తీస్తున్నారు అందరూ. మరి ఈ ప్రశ్నలకు అన్ని జవాబులు ఒకసారి చదువుదాం.
వైష్ణవి చైతన్య మన తెలుగు అమ్మాయి. ఆంధ్రప్రదేశ్ లో ని విజయవాడ ప్రాంతానికి చెందిన వైష్ణవి చైతన్య మొదట్ లో డబ్స్ మాష్ యాప్ లో వీడియోలు చేయడం ప్రారంభించి ఆ తర్వాత టిక్ టిక్ వీడియోలతో బాగా ఫేమస్ అయ్యింది. దాంతో తన పేరు మీద యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి, తన డాన్స్ వీడియోలు, ఫన్నీ కామిక్ వీడియోలు పోస్ట్ చేస్తూ తనకంటూ ఒక సర్కిల్ క్రియేట్ చేసుకుంది.
సోషల్ మీడియాలో అంతగా పాపులర్ అవుతున్న వైష్ణవి చైతన్య ని చూసి ఇన్ఫినిటమ్ మీడియా అనే సంస్థ ఆమెకు ఆఫర్లు ఇచ్చింది ఇక. అక్కడి నుంచి వైష్ణవి షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్, మ్యూజిక్ వీడియో లో మెరిసింది. ముఖ్యంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ షణ్ముక్‌తో వైష్ణవి కలసి నటించిన ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’ టీవీ సిరీస్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. సుబ్రహ్మణ్యం దర్శకత్వం నిర్వహించిన ఈ సిరీస్ సూపర్ హిట్ అయింది. అలానే ‘మిస్సమ్మ’ అనే వెబ్ మూవీతో ఆకట్టుకుంది.
ఇక తన సినిమా ఎంట్రీ మాత్రం 2018లో రవితేజ హీరోగా చేసిన ‘టచ్ చేసి చూడు’ తో మొదలైంది. ఈ సినిమాలో రవితేజ చెల్లెలుగా నటించి, తొలిసారిగా బిగ్ స్క్రీన్ మీద కనిపించింది వైష్ణవి చైతన్య. ఇక ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ హిట్ సినిమా ‘అల వైకుంఠపురము లో’ చిత్రంలో అల్లు అర్జున్ చెల్లెలుగా కనిపించింది. ఆ తరువాత అలాంటి క్యారెక్టర్లు ఎన్నో అందుకుంది వైష్ణవి.. టక్ జగదీశ్, వరుడు కావలెను, రంగ్ దే, ప్రేమదేశం వంటి పలు చిత్రాల్లో నటించింది. అంతేకాదు తమిళంలో కూడా అజిత్ హీరోగా తెరకెక్కిన ‘వాలిమై’ మూవీలో చిన్న క్యారెక్టర్ లో మెరిసింది. ఇలా చిన్న క్యారెక్టర్లు చేస్తూ వచ్చిన వైష్ణవికి బేబీ రూపంలో అదృష్టం తలుపు తట్టింది. సాయిరాజేష్ దర్శకత్వంలో వచ్చిన ‘బేబీ’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.
ఈ సినిమాతో ఎవరు ఊహించని రేంజ్ లో పేరు తెచ్చుకుంది. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా రోజురోజుకీ కలెక్షన్లు పెంచుకుంటూ తెలుగు ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలానే వైష్ణవి చైతన్య కి ప్రేక్షకుల మదిలో స్పెషల్ ప్లేస్ కూడా క్రియేట్ చేసింది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఈ సినిమాలో తన పాత్రను ఆమె చక్కగా పోషించింది. ఓవైపు డీగ్లామర్ గా కనిపిస్తూనే, మరోవైపు గ్లామరస్ గా అదరగొట్టింది.
ఇక ఇటీవల ఓ ఇంటర్వూలో వైష్ణవి మాట్లాడుతూ.. తన తొలి పారితోషికం రూ.700 అని చెప్పింది. ఒక ఈవెంట్ కోసం డ్యాన్స్ చేసే అవకాశం వస్తే.. రోజంతా కష్టపడితే ఏడొందల రూపాయలు ఇచ్చారని తెలిపింది. అలా తన ఫస్ట్ జర్నీ మొదలైందని చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్. కానీ ఇప్పుడు ఎంత సంపాదించినా తన ఫస్ట్ రెమ్యునరేషన్ తనకు చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు మాత్రం తన ‘బేబీ’ సక్సెస్ తో ఈ తెలుగు అమ్మాయికి అవకాశాలు క్యూ కడతున్నాయి. మరి తన కెరియర్ లో ఎలా తీసుకుపోతుందో తెలియాలి అంటే మరి కొద్దిరోజులు వేచి చూడాలి.