Amrapali Kata: ఆమ్రపాలి కాటాం. తెలుగు రాష్ట్రాల్లోనే వన్ ఆఫ్ ది డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్. ఈమె ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన అభ్యర్థి. వరంగల్ అర్బన్ కలెక్టర్ గా మూడు సంవత్సరాల పాటు పని చేశారు. అక్కడ కలెక్టర్‌గా పని చేసినందుకు కాలం తన పనితీరుతో బాగా హైలైట్ అయ్యారు. ఆమ్రపాలికి తెలుగు రాష్ట్రాల్లో యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో కూడా ఆమ్రపాలి యాక్టివ్‌గా ఉంటారు. వరంగల్లో పనిచేసిన అనంతరం పీఎంవోకు బదిలీ అయ్యారు. తాజాగా తెలంగాణకు తిరిగి వచ్చారు. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో అమ్రాపాలి వివరాలు తెలుసుకునేందుకు నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమ్రపాలి గురించి పూర్తి వివరాలు, అలాగే ఆమె భర్త ఎవరు? వీరి ప్రేమ పెళ్లి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగమ్మాయే..
ఆమ్రపాలి 1982, నవంబరు 4న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో కాట వెంకట్‌రెడ్డి, పద్మావతి దంపతులకు జన్మించింది. ఆమ్రపాలి తండ్రి వెంకటరెడ్డి విశాఖపట్నంకి చెందినవారు. వెంకటరెడ్డి ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆమ్రపాలి ఐఐటీ మద్రాస్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ చదువుకున్నారు. ఆ తర్వాత బెంగళూరు ఐఐఎం నుంచి పీజీ డిప్లొమా కూడా చేశారు.
2010లో సివిల్స్ ర్యాంకు..
2010 ఏపీ క్యాడర్ కి చెందిన ఆమె. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఆల్ ఇండియా 39 వ ర్యాంక్ ను సాధించి, ఐఏఎస్‌కు ఎంపికైన అతి పిన్నవయస్కుల్లో ఒకరు.
ఐసీఎస్‌తో పెళ్లి..
2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన తన సమీర్‌శర్మను అమ్రాపాలి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 2018 ఫిబ్రవరి 18న వీరి పెళ్లి జరిగింది. చాలా తక్కువ మంది కుటుంబ సభ్యుల మధ్యలో ఈ వివాహ వేదిక అత్యంత వైభవంగా జరుపుకున్నారు. సమీర్ ఢిల్లీకి చెందినవారు. 2011లో సమీర్ ఐపీఎస్‌కి ఎంపిక అయ్యారు. ఆమ్రపాలి విశాఖ జిల్లాకు చెందినవారు. సమీర్ ఉత్తరాదికి చెందినవారు. వీరిద్దరూ కొంతకాలం ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి వీరు పెళ్లి చేసుకున్నారు. సాంప్రదాయ పద్ధతుల ప్రకారం జమ్ములో వీరి పెళ్లి జరిగింది.