Expensive And Cheapest Cities In India: భారతదేశ ఆర్థిక రాజధాని ఏదంటే ఏం చెబుదాం? వెంటనే ముంబై పేరు వస్తుంది. ఇప్పుడు ముంబై ఆర్థిక రాజధాని మాత్రమే కాదు ఖరీదైన నగరం కూడా. ఇక్కడ ఒక మనిషి జీవించాలంటే తన సంపాదనలో 55 శాతం ఇంటి అద్దె లేదా ఈఎంఐలను చెల్లించాలి. మిగిలిన అన్నీ ఖర్చులు కలిపినా ఇంటికోసం పెట్టే ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. మరి అత్యంత ఖరీదైన నగరం ముంబై. అత్యంత చవకైన సిటీ ఏది. మన హైదరాబాద్ ఏ ప్లేసులో ఉంది. నైట్ ఫ్రాంక్ ఇండియా ఆపర్టబిలిటీ ఇండెక్స్ తాజాగా దేశంలోని టాప్ 8 సిటీస్ జాబితాను విడుదల చేసింది. ఇందులో అత్యంత నివాస యోగ్యమైన నగరంతో పాటు ఖరీదైన నగరాలను చేర్చింది.
నైట్ ఫ్రాంక్ ఇండియా ఆపర్టబిలిటీ ఇండెక్స్ 2021, 2022, 2023 సంవత్సరాల్లో తొలి ఆరునెలల్లో దేశంలోని ప్రజల జీవన స్థితిగతులపై సర్వే చేసింది. సొంతింటిని ప్రజలు కొనగలిగే ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో లెక్కగట్టింది. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేట్లను భారీగా పెంచేసింది. దీంతో ఈ ప్రభావం గృహ రుణాలు తీసుకున్నవారిపై పడింది. ఇవి ప్రధానంగా 2023 ఏడాదిలో మొదటి ఆరు నెలల్లో లోన్ తీసుకున్న వారిపై ప్రత్యక్షంగా పడింది. మరోవైపు రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా డెవలప్ కావడంతో ప్లాట్ల రేట్లు విపరీతంగా పెరిగాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా ఆపర్టబిలిటీ ఇండెక్స్ టాప్ 8 సిటీస్ అంటే ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, ఫుణె, బెంగుళూరు, చెన్నై, అహ్మదాబాద్ , కోల్ కతాలను పరిగణలోకి తీసుకుంది.
దేశంలోని 8 నగరాలను పరిశీలించగా అత్యంత నివాసయోగ్యమైన నగరంగా అహ్మదాబాద్ ను గుర్తించింది. అహ్మదాబాద్ లో ఇల్లు కొనాలంటే ప్రజలు తమకు వచ్చే ఆదాయంలో 23 శాతం వెచ్చించాల్సి ఉంటుంది. మిగిలిన నగరాలతో పోలిస్తే ఇక్కడ కొనగలిగే శక్తి ఎక్కువగా ఉంది. పుణె, కోల్ కతాలో దీని కొంటే కొంచె ఎక్కువగా ఉంది. ఈ రెండు నగరాల్లో 26 శాతం ఇంటికోసం వదులుకోవాలి. సౌత్ సిటీస్ చెన్నై, బెంగుళూరుల్లో నెలవారీ సంపాదనలో 28 శాతం ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి వస్తోంది. ఢిల్లీలో 30 శాతం పే చేయాల్సి ఉంటుంది.
ఖరీదైన నగరాల్లో హైదరాబాద్ టాప్ 2లో ఉంది. ఇక్కడి వారు తమ నివాసానికి నెలవారీ సంపాదనలో 31 శాతం ఖర్చు చేయాలి. హైదరాబాద్ సహా మిగిలిన నగరాలతో పోలిస్తే ముంబైలో 55 శాతం నెలవారీ సంపాదనను వదులుకోవాలి.ఇల్లు కోసం పెట్టే ఖర్చు మిగతా ఖర్చులన్నింటికంటే ఎక్కువే అని చెప్పవచ్చు. కరోనా తరువాత ప్రజలు సొంత ఇంటి కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నారు. దీంతో హోమ్ లోన్ తీసుకునే వారి సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో ఈఎంఐ రేట్లు కూడా పెరుగుతున్నాయి. అయినా చాలా మంది ఇల్లుకు ఖర్చు పెట్టడంలో వెనుకాడడం లేదు.