https://oktelugu.com/

Indians Returning From America: అమెరికా వద్దు.. భారత్ నే ముద్దు.. తిరిగొస్తున్న భారతీయులు..

అమెరికాలో ఉద్యోగం వీసామీద వెళ్లిన వారు తప్పనిసరిగా జాబ్ చేస్తూ ఉండాలి. ఒక వేళ ఉద్యోగం పోయినా మూడు నెలల్లో ఏదో ఒక కంపెనీలో జాయిన్ అయి సంబంధించిన ధ్రువపత్రాలను ఇమిగ్రేషన్ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : September 6, 2023 / 03:39 PM IST

    Indians Returning From America

    Follow us on

    Indians Returning From America: ఉన్నత చదువులు అభ్యసించిన చాలా మంది ఫారిన్ లో ఉద్యోగం చేయాలని అనుకుంటారు. ఈ క్రమంలో అమెరికాను ఫస్ట్ ఆప్షన్ గా ఎంచుకుంటారు. ఒకప్పుడు భారతీయుల నైపుణ్యానికి అమెరికా రెడ్ కార్పెట్ విధించింది. భారీగా జీతాలు ఇస్తూ ఉద్యోగులను నియమించుకుంది. దీంతో ఒకరి తరువాత ఒకరు అన్నట్లు చాలా మంది అమెరికా బాట పట్టారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. అమెరికాకు వెళ్లిన వారు అక్కడ ఉండడానికి భయపడుతున్నారు. వెంటనే కుటుంబంతో సహా ఇండియాకు తిరగొస్తున్నారు. అందుకు కారణాలేంటో తెలుసా?

    అమెరికాలో ఉద్యోగం వీసామీద వెళ్లిన వారు తప్పనిసరిగా జాబ్ చేస్తూ ఉండాలి. ఒక వేళ ఉద్యోగం పోయినా మూడు నెలల్లో ఏదో ఒక కంపెనీలో జాయిన్ అయి సంబంధించిన ధ్రువపత్రాలను ఇమిగ్రేషన్ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేయకపోతే చట్ట విరుద్ధమవుతుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే అమెజాన్ 18 వేల మందిని తొలగించించింది. ఇందులో భారతీయులు చాలా మందే ఉన్నారు. అప్పటి నుంచి ఉద్యోగం కోసం చాలా మంది వెతుకుతున్న వారు ఎన్ని రకాల జాబ్స్ కు ట్రై చేస్తున్నా తిరస్కరణకు గురవుతున్నారు. దీంతో వీరు లే ఆఫ్ నోటీసులు అందుకుంటున్నారు. ఇది పెద్ద ఇష్యూ కాకముందే కుటుంబంతో సహా ఇండియాకు తిరిగి వస్తున్నారు.

    కరోనా తరువాత ప్రపంచం ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది.బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడంతో కోనుగోలు శక్తి తగ్గిపోయింది. అప్పటి నుంచి అమెరికాలోని చాలా కంపెనీలు ఆర్థికంగా కుంగిపోయాయి. ఈ నేపథ్యంలో ఉన్న వాళ్లలో కొంత మందిని తొలగించారు. గతంలోనే మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి బిగ్ కంపెనీలు మానవ వనరులను నియమించుకోవడానికి ఆచి తూచి అడుగేస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగం కోల్పోయిన వారు తిరిగి జాబ్ దక్కించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు.

    ఇదే సమయంలో వీసా విషయంలోనూ అమెరికా నిబంధనలు కఠినతరం చేసింది. దీంతో ఉద్యోగం పోగొట్టుకున్నవారి విషయంలో ఇవి మరీ ఇబ్బందిగా మారాయి. దీంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హెచ్ 1 బీ వీసా కింద వెళ్లిన వారు ఉద్యోగం లేకపోవడంతో కచ్చితంగా స్వదేశానికి వెళ్లాల్సి వస్తోంది. దీంతో వీరు రిటర్న్ అవుతున్నారు.