Badminton Asia Team Championships: : అండర్ డాగ్ నుంచి…ఆసియా ఛాంపియన్ షిప్ గెలిచేదాకా.. ఇదీ మన “బంగారు” తల్లుల ప్రయాణం

ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకోవడం భారత జట్టుకు ఇదే మొదటిసారి. థామస్ కప్ గెలుచుకున్న రెండు సంవత్సరాల తర్వాత భారత జట్టు ఈ ఘనత సాధించడం విశేషం.

Written By: NARESH, Updated On : February 18, 2024 9:28 pm
Follow us on

Badminton Asia Team Championships: : అప్పటిదాకా ఎవరికి అంచనాలు లేవు. గాయం నుంచి కోలుకున్న పీవీ సింధు ఆ టోర్నీ ద్వారానే మళ్లీ షటిల్ రాకెట్ చేత పట్టింది. ఇక మిగతా క్రీడాకారిణుల ర్యాంకులు కూడా అంతంతే. బలమైన చైనాను ఓడించినప్పుడు, ఎత్తులు వేసే హాంకాంగ్ ను మట్టికరిపించినప్పుడు. దుర్భేద్యమైన జపాన్ ను తుత్తునీయలు చేసినప్పుడు మన క్రీడాకారిణుల మీద ఒకసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలను థాయ్ లాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో మన అమ్మాయిలు వమ్ము చేయలేదు. పైగా చరిత్రలో తొలిసారిగా స్వర్ణ పతకం అందించి.. బంగారు తల్లులుగా నిలిచిపోయారు. ఈ విజయం వెనుక ఉన్న ప్రయాణాన్ని ఒక్కసారి పరిశీలిస్తే..

భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు ఆసియా టీం ఛాంపియన్ షిప్ తొలిసారి కైవసం చేసుకోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, అన్మోల్ ఖర్బ్ అద్భుత ప్రదర్శన చేయడంతో భారత జట్టు 3_2 తేడా తో థాయ్ లాండ్ జట్టును ఓడించింది. భారత జట్టు ఛాంపియన్ షిప్ సొంతం చేసుకోవడం ఈ కాంటినెంటల్ టోర్నీలో ఇదే మొదటిసారి. బెస్ట్ ఆఫ్ 5 విధానంలో సాగిన ఫైనల్ మ్యాచ్ ల్లో సింధు, గాయత్రి గోపీచంద్, అన్మోల్, జాలీ ట్రీసా జోడి డబుల్స్ విభాగంలో చిరస్మరణీయమైన విజయాలు సాధించారు.

ఈ టోర్నీకి ముందు భారత జట్టు మీద ఎవరికి పెద్దగా అంశాలు లేవు. పైగా పీవీ సింధు గాయం కారణంగా సుదీర్ఘ విశ్రాంతి తీసుకుంది. ఈ టోర్నమెంట్ మొదలైన తర్వాత బలమైన చైనా జట్టుపై భారత జట్టుకు అన్మోల్ విజయం అందించింది. ఈ ఫలితం తర్వాత అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆమె విజయాన్ని ఉద్దేశిస్తూ ఒక గ్రాఫిక్ పోస్ట్ రూపొందించింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అన్మోల్ చైనా మీద మాత్రమే కాదు సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ లోనూ సత్తా చాటింది. ముఖ్యంగా కోర్టు కవరేజ్, షాట్ ఎంపికలో ఆమె అత్యంత నైపుణ్యాన్ని ప్రదర్శించింది. అంతేకాదు పక్కనే ఉన్న కోచ్ గోపీచంద్ చెప్పినట్టే ఆడడంతో ప్రత్యర్థిపై సోనయాసంగా విజయం సాధించింది. బలమైన సర్వీస్ ల ద్వారా ప్రత్యర్థి క్రీడాకారిణుల చిత్తు చేసింది.” ఆమె చాలా తెలివైనది. ఒత్తిడిని త్వరగా జయిస్తుంది. ఆమె ఆడే ఆట ఎంతో ఎత్తులతో కూడి ఉంటుంది” అని మ్యాచ్ గెలిచిన అనంతరం కోచ్ గోపీచంద్ వ్యాఖ్యానించాడు.

టోర్నీకి ముందు భారత ఏస్ నెంబర్ షట్లర్ పీవీ సింధు గాయపడింది. ఆ గాయం నుంచి కోలుకునేందుకు ఆమె చాలా సమయం తీసుకుంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత పీవీ సింధు ఆడిన తొలి టోర్నీ ఇదే. ఫైనల్ లో థాయ్ షట్లర్ సుపనిందా కతే థాంగ్ ను 39 నిమిషాల్లో సింధు ఓడించింది. 21 _12, 22_12 తేడాతో ఓడించి భారత్ కు 1_0 ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత మూడు గేమ్ ల పోరులో గాయత్రి గోపీచంద్, జాలీ ట్రిసా జోడి 21-16, 18-21, 21-16 తేడాతో జోంగ్ కోల్ ఫామ్, కిటితారాకుల్, రవ్వింద ప్రజోంగ్ జల్ ను ఓడించారు. భారత్ 2-0 లీడ్ లోకి వెళ్ళింది. ఇలా రెండు మ్యాచ్ ల్లో గెలిచిన ఇండియా.. మూడు, నాలుగు మ్యాచ్ ల్లో ఓడిపోయింది.

మూడో మ్యాచ్ లో అస్మితా చలిహా 11-21, 14-21 తేడాతో బుసానన్ ఒంగ్బ మ్రుంగ్ఫాన్ చేతిలో ఓటమిపాలైంది.
ప్రియా, శృతి జోడి బెన్యాప, నుంత కర్న్ చేతిలో 21-14, 22-9 తేడాతో ఓడిపోయారు

నిర్ణయాత్మకమైన ఐదో మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది.. అన్మోల్ అనే 16 సంవత్సరాల క్రీడాకారిణి (472 వ ర్యాంకర్) ప్రపంచ 45వ ర్యాంకర్ చోయికీ వాంగ్ పై వరస గేమ్ లలో విజయం సాధించడంతో భారత జట్టు చరిత్ర సృష్టించింది.

అన్మోల్ ఖర్బ్ వయసు 17 సంవత్సరాలు మాత్రమే. ప్రపంచంలో ఆమె ర్యాంకు 472. అయినప్పటికీ బ్యాడ్మింటన్ ఆసియా టీం ఛాంపియన్ షిప్ లో ఆమె సత్తా చాటింది.

ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకోవడం భారత జట్టుకు ఇదే మొదటిసారి. థామస్ కప్ గెలుచుకున్న రెండు సంవత్సరాల తర్వాత భారత జట్టు ఈ ఘనత సాధించడం విశేషం. బలమైన చైనా, హాంకాంగ్, జపాన్, థాయ్ లాండ్ జట్లను ఓడించి మరి స్వర్ణ పతకాలు సాధించడం గమనార్హం.