Under 19 World Cup: అండర్ 19 వరల్డ్ కప్ లో ఇండియన్ టీమ్ దుమ్ము రేపుతుంది. ఇక సౌతాఫ్రికా తో ఆడిన మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా గ్రాండ్ గా ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఉదయ్ సహరన్ 81 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడంతో ఇండియా చాలా ఈజీగా ఈ మ్యాచ్ ని గెలవగలిగింది. అలాగే సచిన్ దాస్ 96 పరుగులు చేసి మన టీమ్ గెలుపు లో ముఖ్య పాత్ర పోషించాడు.
ఇక ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా టీమ్ నిర్ణీత 50 ఓవర్లకి 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. ఇక 245 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన ఇండియన్ టీమ్ ప్లేయర్లు మొదట్లో కొంతవరకు తడబడ్డప్పటికీ సహరన్, సచిన్ దాస్ ఇద్దరు భారీ ఇన్నింగ్స్ ఆడడమే కాకుండా టీమ్ ను దగ్గరుండి మరి విజయ తీరాలకు చేర్చారనే చెప్పాలి. ముఖ్యంగా వీళ్లిద్దరు ఆడిన ఆటను చూస్తే సౌతాఫ్రికన్ ప్లేయర్లు చెమటలు పట్టాయి.
వీళ్ళ వికెట్లు తీయడం వాళ్లకు చాలా కష్టమైంది. దాంతో ఇండియన్ టీమ్ 48.5 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 248 పరుగులు చేసి గ్రాండ్ విక్టరీ కొట్టింది. దాంతో పాటు గా ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఈ నెల 8వ తేదీన రెండోవ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా పాకిస్తాన్ టీమ్ లు తలబడనున్నాయి. ఇక ఈ రెండింటిలో ఏ టీం అయితే విజయం సాధిస్తుందో ఆ టీమ్ ఈనెల 11వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్ లో ఇండియాతో తలబడనుంది.
ఇక ఏ టీమ్ పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఇండియన్ టీమ్ మాత్రం ఎక్కడా తగ్గకుండా టాప్ గేర్ లో దూసుకుపోతుందనే చెప్పాలి. ఇక గత సంవత్సరం ఇంటర్నేషనల్ వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ కి వచ్చి ఓడిపోయిన ఇండియన్ టీమ్ కప్పు కొట్టలేక పోయింది. కాబట్టి అండర్ 19 లో అయిన భారీ విజయం సాధించి ఇండియా కప్పు కొట్టి మన దేశ పరువుని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలి అని యావత్ దేశ ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. ఇక ఇండియన్ టీం ఫైనల్ లో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి…