India Vs South Africa 3rd T20: ఇండియా సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న టి 20 సిరీస్ ల్లో భాగంగా ఇండియన్ టీం మూడవ టి20 మ్యాచ్ లో ఘన విజయాన్ని సాధించింది. వర్షం కారణంగా మొదటి మ్యాచ్ రద్దు అయినప్పటికీ డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం సౌతాఫ్రికా విజయం సాధించింది.ఇక మూడో మ్యాచ్ లో ఇండియా గెలిస్తే సిరిస్ సమమవుతుంది. లేదా సౌతాఫ్రికా మ్యాచ్ గెలిస్తే సీరీస్ సౌతాఫ్రికా సొంతం అవుతుంది. అని అనుకున్నప్పుడు ఇండియన్ టీమ్ తమదైన ఇన్నింగ్స్ ని ఆడి సౌతాఫ్రికా జట్టు ని కేవలం 95 పరుగులకే అలౌట్ చేసి మరోసారి ఇండియన్ బౌలర్ల సత్తా ఏంటో చూపించారు.మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా టీమ్ నిర్ణీత 20 ఓవర్లకి 7 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేయగా, ఇండియన్ ప్లేయర్లలో ఓపెనర్లు అయిన యశస్వి జైస్వాల్ 60 పరుగులు చేసి ఒక అద్భుతమైన హాఫ్ సెంచరీ నెలకొల్పాడు.
ఇకదానితో సూర్యకుమార్ యాదవ్ ఒక అద్భుతమైన సంచరీ చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో పాటుగా తన ఫామ్ ని మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక వీళ్లిద్దరు రాణించడంతో ఇండియన్ టీం భారీ పరుగులు చేయగలిగింది. ఇక 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా టీం కి మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు ఇద్దరు తక్కువ స్కోరుకే అవుట్ అవ్వడం వల్ల ఆ టీం పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక ఆ టీంలో ఒక మిల్లర్ తప్ప మిగతా ఏ ప్లేయర్ కూడా సరిగ్గా ఆడలేదు. మిల్లర్ కూడా 35 పరుగులకే అవుట్ అయ్యాడు కానీ వాళ్ళ టీం లో అదే హాయేస్ట్ స్కోర్ గా ఉంది…
ఇక ఇండియన్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మరొకసారి రెచ్చిపోయి బౌలింగ్ చేశాడు. సౌతాఫ్రికన్ ప్లేయర్లని కట్టడి చేస్తూ 5 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా కూడా 2 వికెట్లు తీశాడు. ఇక హర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్ లు తలో వికెట్ తీసుకున్నారు. మొత్తానికి ఇండియన్ ప్లేయర్లు చెప్పినట్టుగానే ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ని సమం చేశారు…
ఇక దీనితో ఇండియన్ అభిమానులు అందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యం గా తాత్కాలిక కెప్టెన్ గా ఉన్న సూర్య కుమార్ యాదవ్ తనదైన రీతిలో బ్యాటింగ్ చేస్తూ కెప్టెన్ గా కూడా తన సత్తా చాటుకున్నాడు. ఇక మూడోవ టి 20 లో సెంచరీ చేయడం తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తనకే వరించింది.అలాగే ఇక ప్లేయర్ ఆఫ్ ది టోర్న మెంట్ కూడా తనకే వచ్చింది. ఇటు బ్యాటింగ్ లోనూ, అటు కెప్టెన్ గాను చేస్తూ సక్సెస్ అవ్వడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది…సూర్య సారథ్యం లో ఒక టి 20 కప్ గెలిస్తే, మరొకటి సమం చేశారు…