IND vs ENGLAND: రాజ్ కోట్ వేదిక.. ఇంగ్లాండ్ జట్టుతో మూడో టెస్ట్.. తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టు 319 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. 126 పరుగుల లీడ్ భారత జట్టుకు దక్కింది. మైదానం రోజురోజుకు విభిన్నంగా మారుతున్న నేపథ్యంలో భారీ స్కోరు సాధించి ఇంగ్లాండ్ జట్టు ముందు కొండంత లక్ష్యం పెట్టాలి అనేది భారత జట్టు ఆలోచన. అదే ఆలోచనతో శనివారం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించింది. 30 పరుగులకే రోహిత్ శర్మ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ రెండవ ఇన్నింగ్స్ లో 19 పరుగులకే అవుట్ కావడంతో జట్టులో ఆందోళన నెలకొంది. మరో ఎండ్ లో జైస్వాల్ ఉన్నప్పటికీ ఎక్కడో ఓ మూల ఆందోళన. ఎందుకంటే అతడు తొలి ఇన్నింగ్స్ లో పది పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ ఔట్ కావడంతో గిల్ వన్ డౌన్ బ్యాట్స్ మెన్ గా క్రీజ్ లోకి వచ్చాడు. అటు జై స్వాల్, ఇటు గిల్ ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొంటూ సమయోచితంగా ఆడారు. ఇద్దరూ కలిసి 155 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంగ్లాండ్ కెప్టెన్ నలుగురు బౌలర్లను ప్రయోగించినప్పటికీ వారిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ జైస్వాల్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
తొలి ఇన్నింగ్స్ లో పది పరుగులకే ఔట్ అయిన జైస్వాల్.. రెండవ ఇన్నింగ్స్ లో అత్యంత స్ఫూర్తిదాయకమైన ఆట తీరు ప్రదర్శించాడు. మొదటి 50 పరుగులు చేసేందుకు అతడు డిఫెన్స్ మోడ్ ఆట ఆడాడు. ఆ తర్వాత 50 పరుగులను 42 బంతుల్లోనే అతడు పూర్తి చేశాడంటే ఆట తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యక్తిగత స్కోరు 104 పరుగుల వద్ద ఉన్నప్పుడు.. తీవ్రమైన వెన్ను నొప్పితో అతడు రిటైర్డ్ హార్ట్ గా వెనుతిరిగాడు.. అయితే అతడు ఆ నొప్పితో బాధపడుతూ ఫెవిలియన్ వస్తున్నప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆందోళనతో కనిపించాడు. అతడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆదివారం ఆడేది అనుమానమేనని అందరూ భావించారు. కానీ అతడు ఫినిక్స్ పక్షిలాగా ఆదివారం మళ్లీ ఆట మొదలు పెట్టాడు.
గిల్ ఔట్ అయిన తర్వాత జైస్వాల్ మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. వ్యక్తిగత స్కోరు 104 పరుగుల నుంచి చూస్తుండగానే 154 కొట్టాడు. 12 ఫోర్లు, 7 సిక్స్ ల సహాయంతో అతడు ఈ ఘనత సాధించాడు. జైస్వాల్ తో పాటు సర్ఫ రాజ్ ఖాన్ 23 పరుగులతో ప్రస్తుతం క్రీజ్ లో ఉన్నాడు. ఇంగ్లాండ్ జట్టుపై ప్రస్తుతం భారత్ 447 పరుగుల లీడ్ లో కొనసాగుతోంది. ఐదో వికెట్ కు వీరిద్దరూ 63 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Heartbreak for Shubman Gill..!!
– He misses his well-deserved century by just 9 runs.#ShubmanGill | #INDvENGTest pic.twitter.com/dbfTFcaSvW
— Naji (@Naji_Gill_77) February 18, 2024