India vs England – Akash Deep : ఆకాష్ కోసం ఆకాశమంత ప్రేమ.. ద్రావిడ్ కన్నీరు పెట్టింది అందుకేనా?

ద్రావిడ్ కన్నీటిని ఆపుకోలేకపోతున్నాడు అంటే కచ్చితంగా ఆకాష్ భారత జట్టు ఆశా కిరణం అవుతాడని అభివర్ణిస్తున్నారు. ఆకాష్ కు గొప్ప భవిష్యత్తు ఉందని... దానిని అతడు అందంగా మలుచుకుంటాడని కితాబిస్తున్నారు.

Written By: NARESH, Updated On : February 23, 2024 10:44 pm
Follow us on

India vs England – Akash Deep : రాహుల్ ద్రావిడ్.. ఇండియన్ క్రికెట్ ను వాల్ లా రక్షించిన వ్యక్తి. ఆపద సమయంలో అడ్డుగోడగా నిలబడి జట్టును కాపాడిన వ్యక్తి.. అందుకే రాహుల్ ద్రావిడ్ అంటే చాలామంది ఇష్టపడుతుంటారు. ఇతర దేశాల ఆటగాళ్లు మిస్టర్ డిపెండబుల్ గా వ్యవహరిస్తుంటారు. అలాంటి ద్రావిడ్ కన్నీటి పర్యంతమయ్యాడు. గుండెల్లో అంతులేని ఆవేదనను కన్నీటి రూపంలో బయటపెట్టాడు. ఇన్నాళ్ళ సుదీర్ఘ కెరియర్లో ఎన్నడూ కన్నీరు పెట్టని ద్రావిడ్.. ఒకసారి గా ఎందుకంత కన్నీటి పర్యంతమయ్యాడు?

ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో రాంచి వేదికగా భారత్ నాలుగో టెస్టు ను ప్రారంభించింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టు బుమ్రా కు విశ్రాంతినిచ్చి ఆకాష్ కు అవకాశం ఇచ్చింది. తనకు దక్కిన తొలి అవకాశాన్ని ఆకాష్ సద్వినియోగం చేసుకున్నాడు. తొలి రోజు తొలి ఇన్నింగ్స్ లోనే మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో తానెంతటి ప్రమాదకర బౌలరో ఇంగ్లాండ్ జట్టుకు చాటి చెప్పాడు.

మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆకాష్ భారత టెస్ట్ క్యాప్ తీసుకునే వేడుక జరిగింది. సమయంలో రాంచీ మైదానం ఒక్కసారిగా ఉద్వేగంగా మారిపోయింది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ టెస్ట్ క్యాప్ ను అందించగా ఆకాశ కుటుంబం బాగా భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా ఆకాష్ గురించి రాహుల్ ద్రావిడ్ మాట్లాడాడు. అనేక కష్టాలు దాటుకొని వచ్చిన ఆకాష్.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు..” ఆకాష్ ప్రయాణం బడ్డీ అనే ప్రాంతం నుంచి మొదలైంది. రాంచి నగరానికి 200 కిలోమీటర్ల దూరంలో ఆ ప్రాంతం ఉంది. అక్కడి నుంచి అనేక కష్టాలను దాటుకుని ఆకాష్ ఇక్కడ దాకా వచ్చాడు. 2007లో భారత్ t20 ప్రపంచ కప్ గెలవడం నీలో స్ఫూర్తి కలిగించింది. ఆ తర్వాత నీ ప్రయాణం ఢిల్లీకి మారింది. ఢిల్లీ నుంచి ఇప్పుడు కోల్ కతా చేరుకుంది.. దేశ వాళీ క్రికెట్లో నీ ప్రదర్శన అద్భుతం. అందువల్లే నీ ప్రయాణం రాంచి దాకా వచ్చింది. ఈరోజు టీమిండియా క్యాప్ అందుకున్నారు. దురదృష్టవశాత్తు మీ తండ్రి, మీ అన్నయ్య ఈ లోకం నుంచి విడిచి వెళ్లిపోయారు. వారు ఎక్కడ ఉన్నా సరే నీపై ప్రేమాభిమానాలు కురిపిస్తూనే ఉంటారు. నీకోసం క్యాప్ నెంబర్ 313 అందిస్తున్నానని” ద్రావిడ్ చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేసింది.

కాగా, ఆకాష్ గురించి చెబుతూ రాహుల్ ద్రావిడ్ ఉద్వేగానికి గురయ్యాడు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ ప్రసంగించాడు. ఇటీవల కాలంలో రాహుల్ ద్రావిడ్ ఎన్నడూ కూడా ఇంతటి ఉద్వేగానికి గురి కాలేదు. కాగా ఈ వీడియోని చూసిన నెటిజన్లు స్పందిస్తున్నారు. ద్రావిడ్ కన్నీటిని ఆపుకోలేకపోతున్నాడు అంటే కచ్చితంగా ఆకాష్ భారత జట్టు ఆశా కిరణం అవుతాడని అభివర్ణిస్తున్నారు. ఆకాష్ కు గొప్ప భవిష్యత్తు ఉందని… దానిని అతడు అందంగా మలుచుకుంటాడని కితాబిస్తున్నారు.