India Vs England 2nd Test: ఇండియా ఇంగ్లాండ్ తో ఆడుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియన్ టీం 6 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. ఇక ఇండియన్ టీం ఓపెనర్ ప్లేయర్ గా బరిలోకి దిగిన యశస్వి జైస్వాల్ తన క్లాస్ ఇన్నింగ్స్ తో ఇండియన్ టీమ్ కి భారీ స్కోర్ అందించడంలో కీలకపాత్ర వహించాడు. ఇంగ్లాండ్ బౌలర్లను తను ఎదుర్కొన్న తీరు అద్భుతమనే చెప్పాలి.
ఇక ఇప్పటివరకు ఏ సీనియర్ ప్లేయర్ కూడా ఇలాంటి ఒక క్లాస్ ఇన్నింగ్స్ ఆడలేదు. కానీ జైశ్వాల్ మాత్రం ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు అనే చెప్పాలి. మన ప్లేయర్ల లో శుభ్ మన్ గిల్, రజత్ పాటీదర్ ఇద్దరిని మినహాయిస్తే మిగిలిన ఎవరు కూడా 30 పరుగులకు మించి స్కోర్ చేయలేకపోయారు. కానీ యశస్వి జైశ్వాల్ మాత్రం 179 పరుగులతో ఒక భారీ శతకాన్ని చేయడమే కాకుండా అజయంగా నిలిచాడు.ఇక ఇలాంటి క్రమంలో యశస్వి జైశ్వాల్ లాంటి ఒక స్టార్ ప్లేయర్ ఇండియన్ టీమ్ లో ఉండడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.
తను ఒక గోడ లాగా ఇండియన్ టీమ్ వికెట్లు కూలిపోకుండా అడ్డుకుంటూ పరుగులు సాధిస్తూనే ఒక సూపర్ ఇన్నింగ్స్ ఆడుతూ ఇంగ్లాండ్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు… ఇక ఈ మ్యాచ్ లో రెండవ రోజు కూడా తను ఇలాగే ఆడి డబుల్ సెంచరీని చేసి టీమ్ కి భారీ స్కోర్ అందిస్తే ఇక ఇండియన్ టీమ్ కి తిరుగులేదని చెప్పాలి. నిజానికి ఈ మ్యాచ్ లో జైశ్వాల్ లేకపోతే మన టీం పరిస్థితి మరి దారుణంగా తయారయ్యేది. మిగిలిన ఏ ప్లేయర్ కూడా ఒక హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయకపోవడం తో చాలా తక్కువ స్కోర్ కి ఆలౌట్ అయ్యేది…
ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్, బషీర్ ఇద్దరు కూడా తలో రెండు వికెట్లు తీశారు. జేమ్స్ అండర్సన్, టామ్ హార్ట్ లీ ఇద్దరు తలో వికెట్ తీశారు… ఇక ఇండియన్ బ్యాట్స్ మెన్స్ లలో రోహిత్ శర్మ 14, శుభ్ మన్ గిల్ 34, శ్రేయస్ అయ్యర్ 27, పాటిదార్ 32, అక్షర్ పటేల్ 27, భరత్ 17 పరుగులు చేసి ఔట్ అయ్యారు. ఇక ప్రస్తుతం యశస్వి జైశ్వాల్ 179, అశ్విన్ 5 పరుగులు చేసి క్రీజ్ లో ఉన్నారు…