U19 World Cup 2024: అండర్ 19 వరల్డ్ కప్ లో ఇండియన్ టీం తన మొదటి మ్యాచ్ లో భారీ విజయాన్ని అందుకుంది. ఆడిన ఫస్ట్ మ్యాచ్ నే చాలా గర్వంగా గెలిచి ఇప్పుడు విజయ కేతనాన్ని ఎగరేసి ప్రపంచానికి చాటి చెప్పింది. ఇక దీంతో మరోసారి ఇండియా వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంటూ ప్రపంచ దేశాలు సైతం ఒక్కసారిగా కంగు తింటున్నాయి. ఈ మ్యాచ్ లో అందరూ సమిష్టిగా రాణించి బంగ్లాదేశ్ ని చిత్తు చేశారు. కాబట్టి విజయం సునాయాసంగా ఇండియా ని వరించింది. ఇక ఇదే రీతిలో మిగిలిన మ్యాచ్ ల్లో కూడా రాణిస్తే ఇండియన్ టీం ఈజీగా వరల్డ్ కప్ కొడుతుంది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ మ్యాచ్ లో ఇండియన్ టీం మొదట బ్యాటింగ్ చేసి 251 పరుగులు చేసింది.
అందులో ఓపెనర్ ప్లేయర్ అయిన ఆదర్శ సింగ్ 76 పరుగులు చేయగా, కెప్టెన్ అయిన ఉదయ్ సహారన్ 64 పరుగులు చేసి నిర్ణీత 50 ఓవర్లలో 251 పరుగులను సాధించారు. ఇక 252 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ టీం భారత బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది. అందులో ఇస్లాం 41 పరుగులు చేయగా, మహమ్మద్ షహిబ్ 54 పరుగులు చేశాడు. ఇక వీళ్లిద్దరిని మినహయిస్తే మిగిలిన ప్లేయర్లు ఎవరు కూడా పెద్దగా రాణించకపోవడంతో బంగ్లాదేశ్ చతికల పడిపోయింది. దాంతో ఇండియన్ టీం బౌలర్లు వీరవిహారం చేసి బంగ్లాదేశ్ టీమ్ ను 167 పరుగులకే ఆల్ అవుట్ చేశారు. దాంతో ఇండియన్ టీమ్ విజయం సునాయాసంగా సాగిపోయింది.
గొప్ప విజయాన్ని అందుకున్న ఇండియన్ టీమ్ ని ప్రపంచంలో ఉన్న ప్రతి టీం కూడా అభినందిస్. ఇక ఇదే ఊపులో వరుసగా మిగిలిన మ్యాచులు కూడా గెలుచుకుంటూ రావాలనే ఉద్దేశ్యం లో ఇండియన్ టీం ప్లేయర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది.
గత సంవత్సరం ఇంటర్నేషనల్ వన్డే వరల్డ్ కప్ ని ఫైనల్లోకి వచ్చి ఓడిపోయిన ఇండియన్ టీమ్ అభిమానుల్ని ఆనందపరచడానికి ఈ వరల్డ్ కప్ గెలిచి చూపిస్తాం అంటూ ఇండియన్ టీమ్ ప్లేయర్లు ఇప్పటికే అభిమానులకి మాట ఇచ్చారు మరి వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదా అనే విషయాలు తెలియాలి అంటే మరికొన్ని మ్యాచులు వేచి చూడాల్సిందే. ఇక ఈ మ్యాచ్ లో అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చిన ఆదర్శ్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు…