Homeఅంతర్జాతీయంIndia Russia : అమెరికాను కాదని భారత్ రష్యా వైపునకు ఎందుకు మొగ్గు చూపుతోంది..?

India Russia : అమెరికాను కాదని భారత్ రష్యా వైపునకు ఎందుకు మొగ్గు చూపుతోంది..?

India Russia : 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధం మరిచిపోలేని సంఘటన. తూర్పు పాకిస్తాన్ కు మద్దుతగా నిలిచిన భారత్… పాకిస్తాన్ తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ అవతరణకు తోడ్పడింది. ఆ సమయంలో అమెరికా భారత్ ను పక్కనపెట్టి పాకిస్తాన్ కు అండగా నిలిచింది. ఆ సమయంలో భారత్ తరుపున నిలబడి అన్ని రకాల సాయం చేసిన ఏకైక దేశం సోవియట్ యూనియన్. 1971 ఆగస్టులో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, సోవియట్ ట్రీటీ ఆఫ్ పీసీ ఫ్రెండ్సిఫ్ అండ్ కో ఆపరేషన్ మీద సంతకాలు చేశారు. అప్పటి నుంచి భారత్, రష్యాల మధ్య స్నేహం కొనసాగుతోంది. అయితే ఈ స్నేహం నెహ్రూ కాలంలోనే ప్రారంభమైందని చెబుతూ ఉంటారు. అయితే తాజాగా మోదీ, పుతిన్ ల స్నేహంతో మరోసారి బలమైన మిత్రబంధం ఏర్పడిందని అంటున్నారు.

america vs india russia

థింక్ ట్యాంక్ ‘కార్నెగీ మాస్కో సెంటర్’ డైరెక్టర్ దమిత్రీ తరెనిన్ పుతిన్ భారత పర్యటన గురించి మాస్కో టైమ్స్ లో ఒక ఆర్టికల్ రాశారు. ‘చాలా రోజుల తరువాత పుతిన్ రెండు విదేశీ పర్యటనలు చేశారు. అందులో ఒకటి జూన్ లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో సమావేశం కావడానికి జెనీవా వెళ్లారు. ఆ తరువాత భారత్ మాత్రమే వెళ్లారు. భారత్ కంటే ముందు పుతిన్ చైనా పర్యటనను వాయిదా వేసుకున్నారు. అలాగే జీ -20 సమావేశాలకు కూడా గౌర్హాజరయ్యారు. దీంతో రష్యా, భారత్ ల మధ్య స్నేహ బంధానికి ప్రాధాన్యానికి పుతిన్ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు’ అని రాశారు. అలాగే ‘ ప్రధానమంత్రి మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ల మధ్య స్నేహ సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. అమెరికా ఒత్తిడిని పట్టించుకోకుండా రష్యాకు చెందిన ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను భారత్ కొనుగోలు చేయడం ఇందుకు నిదర్శనం.’ అని రష్యన్ సైంటిస్ట్ అభిప్రాయపడుతున్నారు.

Also Read:  రేవంత్ రెడ్డి కథ క్లైమాక్స్ కు వచ్చిందా? తెరవెనుక ఏం జరుగుతోంది?

భారత్ మాత్రం అవసరాన్ని బట్టి విదేశీ సంబంధాలను కొనసాగిస్తుందని.. అలానే మెదులుతుందని విదేశాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మోదీ అంతకుముందు అమెరికా పర్యటనలు ఎక్కువగా చేశారు. కానీ బైడెన్ అధ్యక్షుడైన తరువాత ఒక్కసారే యూఎస్ వెళ్లారు. అయితే అటు అమెరికాతో స్నేహం కొనసాగిస్తూనే రష్యా నుంచి క్షిపణిలను తెప్పించుకుంటోంది. రష్యా నుంచి భారత్ ఎస్-400 మిసెల్ రక్షణ వ్యవస్థ ఒప్పందం చేసుకోవడంపై అమెరికా విదేశాంగ మంత్రి వెండీ షర్మన్ స్పందించారు. ఈ ఒప్పందం ప్రమాదకరమైనదని తెలిపాడు. వాస్తవానికి రష్యా నుంచి ఏ దేశమైనా ఆయుధాలు కొనుగోలు చేస్తే ఆ దేశంపై ఆంక్షలు విధించాలని అమెరికా నిబంధనలు పెట్టింది. కానీ భారత్ అవేమీ పట్టించుకోకుండా రష్యాతో స్నేహం చేస్తూ వస్తోంది.

అమెరికా ఆంక్షలు పట్టించుకోకుండా తమతో భారత్ స్నేహం చేయడాన్ని రష్యా విదేశాంగ శాఖ మంత్రి ప్రశంసించారు. భారత్ ఒక సార్వ భౌమాధికార దేశంలానే నిర్ణయం తీసుకుందని కొనియాడారు.. అయితే అమెరికాపై నమ్మకం తగ్గడంతోనే రష్యాతో భారత్ స్నేహం చేయాల్సి వచ్చిందా..? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ‘అప్ఘనిస్తాన్ నుంచి తమ సైనికులను వెనక్కు పిలిపించిన ప్రక్రియలో అమెరికా.. భారత్ ను ఏకాకి చేసింది. అప్ఘనిస్తాన్లో ఉన్న భారత్ ఏడు భారీ పెట్టుబడులు ఈ నిర్ణయంతో ప్రమాదంలో పడ్డాయి. ’ అసలు వేరే దేశాల ప్రాధామ్యాలకు అస్సలు విలువ ఇవ్వకుండా అమెరికా ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయంతోనే అమెరికాపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం సడలింది. ఇక ఆస్ట్రేలియాకు జలాంతర్గామిలను ఇచ్చి ఫ్రాన్స్ తో ఒప్పందాన్ని రద్దు చేయించిన అమెరికా సొంత నాటో మిత్రదేశాన్ని వెన్నుపొటు పొడించింది. అందుకే అమెరికాను నమ్మి మునిగే కన్నా రష్యాతో వెళ్లడమే బెటర్ అని భారత్ భావిస్తోంది.

రష్యా ద్వారా భారత్ మధ్య ఆసియాలోకి ప్రవేశం చేసే అవకాశం ఉంది. మధ్య ఆసియాకు చేరుకోవాలంటే పాకిస్తాన్ కాదనుకొని ఇరాన్ ద్వారా వెళ్లాలి. అయితే అమెరికాతో స్నేహం వల్ల ఇరాన్ భారత్ కు దగ్గర లేదు. దీంతో భారత్ కు రష్యా సహకారం ద్వారా ఇరాన్ సమస్యను కూడా పరిష్కరించుకోవచ్చు. అయితే రష్యా, భారత్ సహకారం ఆందోళనకు దారి తీసే అవకాశాలు లేకపోతేదు. అప్ఘనిస్తాన్లో అధికారం చేజిక్కించుకోవడానికి రష్యా జరిపిన చర్చల్లో చైనా, అమెరికా, తాలిబన్లు, పాకిస్తాన్ కు అవకాశం ఇచ్చింది. కానీ భారత్ కు ఆహ్వానం పంపలేదు. మరోవైపు మధ్య ఆసియా ఇస్లామిక్ స్టేట్, ఆల్ ఖైదా వశం అవుతుందని ఈ ప్రభావం భారత్ పై పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. సో అవసరార్థం భారత్ విదేశాంగ విధానం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్ ప్రయోజనాల ఆధారంగా బంధాలు ఏర్పరుచుకోవాలని సూచిస్తున్నారు.

Also Read: 21 ఏళ్ల వివాహ చట్ట సవరణ: పెద్దఎత్తున ఆడపిల్లలకు పెళ్లిళ్లు.. గడువుకంటే ముందే కానిచ్చేస్తున్నారు!

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular