https://oktelugu.com/

కరెన్సీ కష్టాల్లో ఇండియా?

దేశం యావత్తు కరోనా దెబ్బకు కుదేలయింది. వరుసగా రెండో ఏడాది నష్టాల్లో పడిపోయింది. ప్రజల ఆరోగ్యంతోపాటు ఆర్థిక అసమానతలు తీవ్రంగా కలిచివేస్తున్నాయి.దీంతో భారత్ తిరోగమనంలో పయనిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రజల నుంచి విచ్చలవిడిగా నిధులు లాగేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పెట్రోధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్రానికి కొత్త చిక్కు వచ్చి పడింది. కరెన్సీ నోట్ల ముద్రణపై మాజీ ఆర్థికమంత్రి చిదంబరంతోపాటు పలువురు ఆర్థికవేత్తలు సలహాలు ఇస్తున్నారు. గత ఏడాది తొలి లాక్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 3, 2021 / 02:51 PM IST
    Follow us on

    దేశం యావత్తు కరోనా దెబ్బకు కుదేలయింది. వరుసగా రెండో ఏడాది నష్టాల్లో పడిపోయింది. ప్రజల ఆరోగ్యంతోపాటు ఆర్థిక అసమానతలు తీవ్రంగా కలిచివేస్తున్నాయి.దీంతో భారత్ తిరోగమనంలో పయనిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రజల నుంచి విచ్చలవిడిగా నిధులు లాగేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పెట్రోధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్రానికి కొత్త చిక్కు వచ్చి పడింది. కరెన్సీ నోట్ల ముద్రణపై మాజీ ఆర్థికమంత్రి చిదంబరంతోపాటు పలువురు ఆర్థికవేత్తలు సలహాలు ఇస్తున్నారు.

    గత ఏడాది తొలి లాక్ డౌన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ హెలికాప్టర్ మనీ గురించి ప్రస్తావించారు.హెలికాప్టర్ మనీ అంటే ప్రజలకు నేరుగా పెద్ద ఎత్తున నగదును అందుబాటులోకి తీసుకెళ్లడం. ప్రస్తుతం వైరస్ కారణంగా ప్రజందరి ఉపాధి దెబ్బతిన్నది. ఖర్చు పెట్టడానికి వారి వద్ద డబ్బులు లేవు.మళ్లీ దేశంలో పరిస్థితి ఎప్పుడు గాడిన పడుతుందో తెలియదు. ఈ గండాన్ని గట్టెక్కించాలంటే ప్రజలకు పెద్దఎత్తున నగదు అందుబాటులోకి తేవాలి. లక్షలకోట్లు ప్రజలకు చేరిస్తే మళ్లీ అమ్మకాలు,కొనుగోళ్లు పెరిగి ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందని ఆర్థిక వేత్తల అభిప్రాయం.

    ప్రస్తుతం ఆర్బీఐ వద్ద నిధుల్లేవు. లక్ష కోట్లు కేంద్రానికి ఇచ్చింది. గత ఏఢాది రూ.1.75 వేల కోట్లు ఖజానాకు మళ్లించుకుంది కేంద్ర ప్రభుత్వం. క్వాంటీటేటివ్ ఈజింగ్ పద్ధతిలో రాష్ర్టాలకు నిధులు సమకూర్చాలన్నా ప్రింట్ చేయడం తప్ప మారో మార్గం లేదు. రిజర్వు బ్యాంకు దగ్గర ఉన్న బంగారం నిల్వలు,విదేశీ మారక ద్రవ్య నిల్వలు, జీడీపీ లెక్కల ఆధారంగా నగదును ప్రింట్ చేస్తుంది. నోట్లు ప్రింట్ చేయడం దేశానికి దీర్ఘకాలంలో చేటు చేసేలా ఉంటుంది. అందుకే ఉత్పాదకతకు సంబంధం లేకుండా అధికంగా డబ్బులు ప్రింట్ చేస్తే అవిచిత్తు కాగితాలత సమానంగా మారుతాయి.