https://oktelugu.com/

Australia vs India : చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా రికార్డ్…

మొదట 2012 లో సౌత్ ఆఫ్రికా టీమ్ మొదటి సారి గా మూడు ఫార్మాట్లలో ఒకేసారి నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకుంది...

Written By:
  • Gopi
  • , Updated On : September 23, 2023 / 09:24 AM IST

    Team India

    Follow us on

    Australia vs India : ఏషియా కప్ లో భారీ విజయాలను నమోదు చేసుకొని ఏషియా కప్ ని ఎనిమిదోవ సారి దక్కించుకున్న ఇండియా టీమ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా తో మూడు వన్డే లు ఆడుతుంది. అందులో భాగంగానే నిన్న ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో ఇండియా ఒక భారీ విజయాన్ని అందుకుంది…రోహిత్ శర్మ, కోహ్లీ , హార్దిక్ పాండ్య లాంటి ముగ్గురు సీనియర్ ప్లేయర్లు లేకపోయినా కూడా ఒక జూనియర్ టీమ్ గా ఇండియా బరిలోకి దిగి ప్రపంచ క్రికెట్ లో దిగ్గజ టీమ్ గా గుర్తింపు పొందిన ఆస్ట్రేలియా టీమ్ ని మట్టికరిపించడం అంటే మామూలు విషయం కాదు.

    కేఎల్ రాహుల్ సారథ్యం లో ఆడిన ఇండియా టీమ్ చాలా వరకు మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది. ఇక మన పేస్ బౌలర్ అయిన షమీ విజృంభించి బౌలింగ్ చేసి 51 రన్స్ ఇచ్చి 5 వికెట్లు తీశాడు…ఇక మన బ్యాట్స్ మెన్స్ అందరూ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఇండియా కి ఇంకో 8 బాల్స్ మిగిలి ఉండగానే విజయాన్ని అందించారు.ఈ మ్యాచ్ లో శుభమాన్ గిల్ ,కేల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్,సూర్య కుమార్ యాదవ్ వీళ్ళు నలుగురు కూడా హాఫ్ సెంచరీల తో చెలరేగారు. అందుకే ఇండియా కి ఈ మ్యాచ్ గెలవడం చాలా ఈజీ అయిపోయింది…

    ప్రస్తుతం ఇండియా టీమ్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో 116 పాయింట్లతో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది…ఇక మన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ టీమ్ 115 పాయింట్ల తో సెకండ్ పొజిషన్ కి పడిపోయింది…ప్రస్తుతం ఇండియా మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ పొజిషన్ లో నిలిచింది…ఇక రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నపుడు ఇండియా ఈ ఘనత అందుకోవడం కూడా ఒక వంతు కి గ్రేట్ అనే చెప్పాలి…

    అయితే క్రికెట్ హిస్టరీ లోనే ఈ ఘనత అందుకున్న సెకండ్ టీమ్ గా ఇండియా అవతరించింది.మొదట 2012 లో సౌత్ ఆఫ్రికా టీమ్ మొదటి సారి గా మూడు ఫార్మాట్లలో ఒకేసారి నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకుంది…ఇక వాళ్ల తర్వాత ఇప్పుడు మన ఇండియా టీమ్ ఇలాంటి గౌరవాన్ని దక్కించుకుంది…ఇక వరల్డ్ కప్ కి ముందే ఇలాంటి ఫీట్ ని సాధించడం ఇండియన్ ప్లేయర్లలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుందనే చెప్పాలి…