https://oktelugu.com/

Ind v Aus : చరిత్ర సృష్టించిన భారత్.. అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్!

ఒకే ఇయర్ లో మూడు ఫార్మాట్లలో భారత జట్టు మొదటి స్థానంలో నిలవడం ఇదే మొదటిసారి. భారత క్రికెట్ చరిత్రలో ఇదో సరికొత్త రికార్డు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 23, 2023 / 01:11 AM IST
    Follow us on

    Ind v Aus : ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో అద్భుతమైన గెలుపుతో టీమిండియా చరిత్ర సష్టించింది. భారత జట్టు మళ్లీ వన్డేల్లో నంబర్-1 ర్యాంక్ దక్కించుకుంది. 116 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకుంది. ఇక, 115 పాయింట్లు ఉన్న దాయాది దేశం పాకిస్థాన్ రెండో స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్ లో చివరిదాకా పోరాడి ఓడిన ఆసీస్ మూడో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

    మూడు ఫార్మాట్లలో మనమే తోపు..
    టీమిండియా ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్లలో నంబర్ వన్ స్థానాల్లో ఉంది.. తాజాగా ఆసీస్ పై విజయం సాధించడంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లో అగ్రస్థానానికి చేరుకుంది. ఒకే ఇయర్ లో మూడు ఫార్మాట్లలో భారత జట్టు మొదటి స్థానంలో నిలవడం ఇదే మొదటిసారి. భారత క్రికెట్ చరిత్రలో ఇదో సరికొత్త రికార్డు.

    ఆస్ట్రేలియాదే ఆధిక్యం..
    ఇదిలావుంటే.. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటివరకు మొత్తం 146 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. 82 మ్యాచ్‌లు గెలిచిన ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. భారత జట్టు 54 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 10 మ్యాచ్‌లలో ఫలితం లేదు. ఇక మొహాలీలో ఇరు జట్ల మధ్య మొత్తం 5 మ్యాచ్‌లు జరిగాయి. కంగారూ జట్టు ఇక్కడ నాలుగు మ్యాచ్‌లు గెలుపొందగా.. భారత్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది.

    ఆస్ట్రేలియా చిత్తు..
    అయితే, ఈరోజు మొహాలీ స్టేడియంలో ఉత్కంఠంగా సాగిన పోరులో రాహుల్ సేన‌ ఆస్ట్రేలియా జట్టును 5 వికెట్ల తేడాతోచిత్తు చేసింది. దాంతో, ఈ స్టేడియంలో ఆసీస్‌పై 13 సంవత్సరాల తర్వాత తొలిసారి టీమిండియా గెలుపొందింది. ఆసీస్ నిర్ధేశించిన 277 పరుగుల లక్ష్య ఛేద‌న‌లో ఓపెన‌ర్లు శుభ్‌మ‌న్ గిల్(63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 74 పరుగులు), రుతురాజ్ గైక్వాడ్(77 బంతుల్లో 10 ఫోర్లతో 71 పరుగులు) శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యారు కేవలం 3 పరుగులకే రనౌట్ అయి.. పెవిలియన్ బాట పట్టాడు. దీంతో బరిలోకి దిగిన కెప్టెన్ కేఎల్ రాహుల్( 63 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సుతో58 పరుగులు నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సుతో 50 పరుగులు) కీల‌క ఇన్నింగ్స్ ఆడి జ‌ట్టుకు గెలుపును అందించారు. ఈ విజ‌యంతో భార‌త్ మూడు వ‌న్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది.