https://oktelugu.com/

IND vs SA ODI World Cup : కోహ్లీ సెంచరీ ఎఫెక్ట్ : రికార్డులు బద్దలు అంతే…

ఇక ఇంతకు ముందు తో పోలిస్తే ఇదే హైయెస్ట్ రికార్డ్ అని తెలుస్తుంది... ఇంతకు ముందు ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ని 4.0 కోట్ల (4 కోట్ల) మంది చూశారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2023 / 09:26 AM IST
    Follow us on

    Virat Kohli Century Records  : వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా వరుస విజయాలను అందుకుంటూ తనదైన మార్క్ చూపిస్తూ ప్రపంచంలో ఉన్న ఏ టీం కూడా తనకు పోటీ కాదు అనే విధంగా విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. ఇట్లాంటి క్రమంలో ఇండియన్ టీం సౌతాఫ్రికా తో ఆడిన మ్యాచ్ లో తనదైన రీతిలో అద్భుతాలను క్రియేట్ చేసిందనే చెప్పాలి.

    ముఖ్యంగా బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ తో ఇండియన్ టీం బ్యాటింగ్ లైనప్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మిగితా టీమ్ లకి మరోసారి అర్థమైంది. ఇక చివరిలో రవీంద్ర జడేజా కూడా తనదైన మార్క్ ఇన్నింగ్స్ తో షాట్స్ కొడుతూ మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు…శ్రేయాస్ అయ్యర్ కూడా లాస్ట్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేశాడు అలాగే ఇప్పుడు కూడా హాఫ్ సెంచరీ చేసి తన ఆట తోనే అందరికీ సమాధానం చెప్తున్నాడు…

    ఇక ఇలాంటి క్రమంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో టెలికాస్ట్ అవుతున్న ఈ మ్యాచ్ ని చాలామంది తిలకించారు. కానీ విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన సమయంలో అది కూడా 49వ సెంచరీ కావడంతో సచిన్ రికార్డ్ తో సమం చేసే సెంచరీ కావడంతో ఆ పర్టిక్యూలర్ సీన్ ని చూడటానికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మునుపు ఎన్నడూ లేని విధంగా 4.4 కోట్ల (4 కోట్ల 40 లక్షల )మంది ఈ మ్యాచ్ ని చూడటం జరిగింది…

    ఇక ఇంతకు ముందు తో పోలిస్తే ఇదే హైయెస్ట్ రికార్డ్ అని తెలుస్తుంది… ఇంతకు ముందు ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ని 4.0 కోట్ల (4 కోట్ల) మంది చూడటం జరిగింది. ఇక దాన్ని బ్రేక్ చేస్తూ ఈ మ్యాచ్ ని 4.4 కోట్ల మంది చూడటం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…ఇక ఇండియా ఇక మీదట ఆడే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఈ రికార్డ్ కూడా బ్రేక్ అయి మరో కొత్త రికార్డ్ క్రియేట్ అవుతుంది అంటూ చాలా మంది వాళ్ల అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది…

    నిజానికి ఇండియా టీమ్ సెమీస్ గెలిచి ఫైనల్ కి వెళ్తే ఇక ఆ మ్యాచ్ చూసే వాళ్ల సంఖ్య దాదాపు 6 కోట్ల వరకు వెళ్లిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు…నిజానికి ఈసారి వర్డ్ కప్ ఇండియన్ టీమ్ గెలవబోతుందనే విషయం మనకు ఇప్పటికే అర్థం అయింది…కాబట్టి ఇండియన్ అభిమానులందరూ కూడా ఇప్పడు ఉన్న మన టీమ్ ని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు…