IND vs NZ : వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్‌లో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోర్‌

ఇక విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యార్‌ సెంచరీలతో చెలరేగగా, గిల్‌ ఆఫ్‌ సెంచరీ చేశాడు. దీంతో టీమిండియా 397 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

Written By: NARESH, Updated On : November 15, 2023 8:08 pm
Follow us on

IND vs NZ : ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌ –2023 సమీ ఫైనల్‌లో భారత్‌ భారీ స్కోర్‌ చేసింది. ముంబైలోని వాంకడె స్టేడియంలో న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా 397 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసింది. కోహ్లీ(117), శ్రేయస్‌ అయ్యర్‌(105) సెంచరీలతో చలరేగారు, గిల్‌(80), కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (47) పరుగులు చేశారు. దీంతో భారత్‌ 398 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ ముందు ఉంచింది. కాగా, వన్డే వరల్డ్‌ కప్‌లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోర్‌ కావడం గమనార్హం.

వన్డే వరల్డ్‌ కప్‌ సమీఫైనల్ లో..
భారత్‌ ఇప్పటి వరకు ఆడిన వన్డే వరల్డ్‌ కప్‌లలో చాలాసార్లు సెమీ ఫైనల్‌కు చేరింది. కానీ, ఇంత భారీ స్కోర్‌ గతంలో ఎప్పుడూ చేయలేదు.
– 2011లో భారత్‌ పాకిస్థాన్‌ సెమీ ఫైనల్‌లో తలపడ్డాయి. ఇందులో భారత్‌ 260 పరుగులు చేసింది. పాకిస్థాన్‌ 231 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఈ ఏడాది భారత్‌ వరల్డ్‌ కప్‌ రెండుసారి సాధించింది.

– 2015లో నూ భారత్‌ సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇందులో ఆస్ట్రేలియాతో తలపడింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 315 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. భారత్‌ 260 పరుగులకే ఆలౌట్‌ అయింది.

– 2009 వరల్డ్‌ కపల్‌లో భారత్‌ లీగ్‌ దశలోనే వెనుదిరిగింది.

– 2006 వరల్డ్‌ కప్‌లో కూడా భారత్‌ సెమీ ఫైనల్‌కు చేరింది. ఈ సిరీస్‌లో శ్రీలంకతో భారత్‌ తలపడింది. మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 251 పరుగులు చేయగా, భారత్‌ 120 పరుగులకే ఆలౌట్‌ అయింది.

– 1987 వరల్డ్‌ కప్‌లో టీమిండియా లీగ్‌ దశలోనే వెనుదిగిరింది.

– 1983 వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్‌ ఇంగ్లడ్, భారత్‌ మధ్య జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 213 పరుగులు చేయగా, టీమిండియా కేవలం 4 వికెట్లు కోల్పోయి 2017 పరుగులు చేసింది. ఈ ఏడాది కపిల్‌దేవ్‌ సారథ్యంలో టీమిండియా వరల్డకప్‌ తొలిసారి సాధించింది.

2023లో భారీ స్కోర్‌..
ఇక తాజాగా 2023 వరల్డ్‌ కప్‌లో భారత్‌ లీగ్‌ దశలో ఓటమి ఎరుగకుండా సెమీ ఫైనల్‌కు చేరింది. తొలి సెమీఫైనల్‌ న్యూజిలాండ్‌ – భారత్‌ తలపడగా, రెండో సెమీఫైనల్‌ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగనుంది. తొలి సెమీఫైనల్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ చెలరేగడంతో మొదటి 10 ఓవర్లలో 83 పరుగులు చేసింది. రోహిత్‌ 47 పరుగులు వద్ద ఔట్‌ అయాయరు. ఇక విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యార్‌ సెంచరీలతో చెలరేగగా, గిల్‌ ఆఫ్‌ సెంచరీ చేశాడు. దీంతో టీమిండియా 397 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. దీంతో వన్డే వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్‌ చరిత్రలో రికార్డు స్కోర్‌ నమోదు చేసింది.