ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో రాంచి వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పడి లేచిన కెరటం లాగా అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో సత్తా చాటింది. ఫలితంగా మరో టెస్ట్ మిగిలి ఉండగానే సిరీస్ ఒడిసి పట్టింది. మొదటి ఇన్నింగ్స్ లో ప్రత్యర్థి జట్టు కంటే 47 పరుగులు వెనుకబడి ఉన్నప్పటికీ.. రెండవ ఇన్నింగ్స్ లో భారత జట్టు అనూహ్యంగా పుంజుకుంది. భారత బౌలర్లు రెండవ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టును 145 పరుగులకే ఆల్ అవుట్ చేశారు. అనంతరం ఇంగ్లాండ్ విధించిన 192 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ సాధించిన ఈ చిరస్మరణీయ విజయం పట్ల క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar) ట్విట్టర్ వేదికగా స్పందించాడు.
The score is 3-won!
India once again came back from a pressure situation and fought back to win the match. It shows the character and the mental strength of our players.
A great first spell in Test cricket for Akashdeep. @dhruvjurel21 was terrific at reading the length in… pic.twitter.com/DgaFoqMiTa
— Sachin Tendulkar (@sachin_rt) February 26, 2024
” స్కోర్ 3 – విజయం. భారత్ మరోసారి ఒత్తిడి నుంచి తేరుకుంది. మ్యాచ్ లో విజయం సాధించేందుకు పోరాడింది. ఇందులో ప్రతి ఒక్క ఆటగాడి పాత్ర ఉంది. ఈ విజయం ఆటగాళ్లలో ఉన్న మానసిక శక్తిని ప్రతిబింబిస్తోంది. టెస్ట్ క్రికెట్లో ఆకాష్ దీప్ కిది గొప్ప తొలి స్పెల్. ధ్రువ్ జురెల్ రెండు ఇన్నింగ్స్ లలో కీలకంగా ఆడాడు. అతడి ఫుట్ వర్క్ చాలా కచ్చితంగా ఉంది. కులదీప్ యాదవ్ తో అతడు నెలకొల్పిన భాగస్వామ్యం జట్టును నిలబెట్టింది.. రెండవ ఇన్నింగ్స్ లో అతడు చూపించిన పటిమ బాగుంది. రెండవ ఇన్నింగ్స్ లో కులదీప్ బౌలింగ్ స్పెల్ చాలా కీలకం. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ కీలకపాత్రను పోషించారు. శుభ్ మన్ గిల్ ఛేజింగ్ లో తన పూర్వ స్వభావాన్ని కనపరిచాడు. జట్టుకు అత్యంత ముఖ్యమైన 50 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ విజయంతో పాటు, సిరీస్ కూడా దక్కడం సంతోషంగా ఉందంటూ” సచిన్ ట్విట్ చేశాడు.
Gill played well
Sara right now pic.twitter.com/owT0PKAkx8
— भाई साहब (@Bhai_saheb) February 26, 2024
గిల్ ఆడిన తీరును, రెండవ ఇన్నింగ్స్ లో అతడు చేసిన హాఫ్ సెంచరీని సచిన్ ప్రత్యేకంగా కొనియాడటం పట్ల నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. సచిన్ కూతురు సారా, గిల్ మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నట్టు గత కొంతకాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. వాటికి బలం చేకూర్చే లాగా అటు సారా, ఇటు గిల్ వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సచిన్ గిల్ ఆటను ఉద్దేశించి చేసిన కామెంట్లపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. గిల్ ఆటను సచిన్ మెచ్చుకున్నాడు కాబట్టి, సారా కు గ్రీన్ సిగ్నల్ లభించినట్టేనని కామెంట్లు చేస్తున్నారు. బహుళ ప్రజాదరణ పొందిన హిందీ సినిమాల్లోని కొన్ని సన్నివేశాలను ఇందుకు జత చేస్తున్నారు. టీమిండియా విజయం సాధించిన నేపథ్యంలో సచిన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.