IND vs AUS : ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నా మొదటి వన్డే మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి మొదట బౌలింగ్ తీసుకుంది. ఇక టాస్ ఓడిపోయి మొదటి బ్యాటింగ్ కి వచ్చిన ఆస్ట్రేలియన్ టీం కి మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. నాలుగు పరుగులు చేసిన మిచెల్ మార్ష్ ని షమీ అవుట్ చేసాడు.ఇక ఆస్ట్రేలియా టీం మొదట్లోనే కొంత వరకు ఇబ్బంది పడింది. అయితే ఈ మ్యాచ్ లో వార్నర్ హాఫ్ సెంచరీ చేసి ఆస్ట్రేలియా టీం కి మంచి స్కోర్ అందించడం లో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఆ తర్వాత వచ్చిన స్టీవ్ స్మిత్ 41 పరుగులుచేసాడు, అలాగే లాబుషాంగే 39 పరుగులుకి చేసాడు. ఇక వరుసగా గ్రీన్ 31, జోస్ ఇంగ్లిస్ 45, స్టోయినిస్ 29 పరుగులు చేసారు. ఇక చివర్లో కెప్టెన్ కమ్మిన్స్ కూడా 9 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టి 21 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు…ఇక ఆస్ట్రేలియా నిర్ణిత 50 ఓవర్ల కి 276 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది…
ఇక ఈ మ్యాచ్ లో ఇండియన్ బౌలర్లు ఆస్ట్రేలియా టీం ని ఎక్కువ స్కోర్ చేయకుండా కట్టడి చేయడం లో చాలా వరకు సక్సెస్ అయ్యారనే చెప్పాలి.ఇక ఈ మ్యాచ్ లో షమీ 5 వికెట్లు తీసాడు,బుమ్రా,అశ్విన్,జడేజా ముగ్గురు కూడా తలో వికెట్ తీశారు.ఇక శార్దూల్ ఠాకూర్ మాత్రం ఒక్క వికెట్ కూడా తీయలేదు.పైగా 10 ఓవర్లు బౌలింగ్ వేసి 78 రన్స్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో షమీ సూపర్ సక్సెస్ అయితే ఠాకూర్ మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఇక అక్షర్ పటేల్ ప్లేస్ టీం లోకి వచ్చిన అశ్విన్ 10 ఓవర్లు బౌలింగ్ వేసి 47 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసాడు.అయితే చాలా అంచనాల మధ్య టీం లోకి వచ్చిన అశ్విన్ ఈ మ్యాచ్ లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు.ఇలా చేస్తే అశ్విన్ ని వరల్డ్ కప్ టీం లోకి తీసుకోవడం చాలా కష్టం అనే చెప్పాలి. ఎందుకంటే అశ్విన్ కి పోటీ గా వాషింగ్ టన్ సుందర్ ఉన్నాడు, అలాగే అక్షర్ పటేల్ కూడా ఉన్నాడు. ఇక వీళ్ళని కాదని అశ్విన్ కి ఛాన్స్ రావాలంటే ఆయన ప్రూవ్ చేసుకోవాలి కానీ ఈ మ్యాచ్ లో అశ్విన్ తేలిపోయాడు.ఒక వికెట్ తీసిన కూడా అది పెద్ద గా ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు.ఇక ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్స్ ని ఆయన కట్టడి చేయడం లో చాలా వరకు ఫెయిల్ అయ్యాడు అనే చెప్పాలి…
ఇక 277 పరుగులు లక్ష్యం గా బరిలోకి దిగిన ఇండియా టీం కి ఓపెనర్లు అయిన శుభమన్ గిల్, ఋతురాజ్ గైక్వాడ్ చాలా మంచి శుభారంభాన్ని ఇచ్చారు.ఇప్పటికే గిల్ హాఫ్ సెంచరీ చేసాడు గైక్వాడ్ 42 పరుగులు చేసాడు ఇద్దరు కూడా ఇంకా ఆడుతూనే ఉన్నారు.ఇక ఇండియా స్కోర్ 16 ఓవర్లు పూర్తి అయ్యేసరికి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 102 పరుగులు చేసింది. ఇక మన బ్యాట్స్ మెన్స్ స్పీడ్ చూస్తుంటే ఈ మ్యాచ్ లో ఇండియా ఈజీగా గెలుస్తుంది అని తెలుస్తుంది…