IND vs AUS 1st T20: నెంబర్ వన్ ర్యాంకు జట్టు.. నెంబర్ 6 ర్యాంకు జట్టు పరస్పరం తలపడితే.. విజయం ఎవరి వైపు ఉంటుంది? చిన్నపిల్లాడినడిగినా నెంబర్ వన్ ర్యాంక్ జట్టు అనే చెబుతాడు. కానీ యాదృచ్ఛికంగా ఒకటో నెంబర్ జట్టు మీద ఆరో నెంబర్ జట్టు గెలిచింది. ఏంటి నమ్మశక్యంగా అనిపించడం లేదా? నిన్న మొహాలీ లో జరిగిన ఆస్ట్రేలియా భారత్ మధ్య టి20 మ్యాచ్ నమ్మశక్యంగాని ఫలితాన్నే ఇచ్చింది. 200కు పైచిలుకు స్కూలు సాధించినా భారత జట్టు ఓడిపోయింది అంటే బౌలింగ్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వైఫల్యాల నుంచి ఎప్పుడు పాఠాలు నేర్చుకుంటారు
ఆసియా కప్ లో ఫేవరెట్ గా బరిలోకి దిగి పేలవమైన ఆటతీరుతో భారత్ ఇంటిదారి పట్టింది. ఈ ఓటమి నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నామని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ అవన్నీ గాలి మాటలే అని మ్యాచ్ ద్వారా అర్థమైంది. ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఆఫ్ఘనిస్తాన్ పై మెరుపులు మెరిపించిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో తేలిపోయాడు. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ పుణ్యమా అని భారత్ 200 పై చిలుకు స్కోరు సాధించింది.
బౌలర్లు, ఫీల్డర్లు విఫలం
అంత భారీ స్కోరు సాధించిన తర్వాత భారత జట్టు గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ భారత అభిమానుల ఆశలను ఆస్ట్రేలియా క్రీడాకారులు ఆడియాసలు చేశారు. మొదటినుంచి అటాకింగ్ ఆటతీరుతో ఆస్ట్రేలియా ఆటగాడు గ్రీన్ ఆకట్టుకున్నాడు. భారత్ బౌలింగ్లో పస లేదు అనడానికి అతడి ఆట తీరే నిదర్శనం. మరి ముఖ్యంగా అతని రెండు క్యాచ్ లను భారత ఫీల్డర్లు నేలపాలు చేయటం అభిమానులను నిర్వేదానికి గురిచేసింది.

ముఖ్యంగా డెత్ ఓవర్లలో భువనేశ్వర్ కుమార్, చాహాల్ బౌలింగ్ తీరు ఏవగింపు కలిగించింది. మొన్నటికి మొన్న ఆసియా కప్ లో భువనేశ్వర్ కుమార్ తీరు వల్లే భారత్ మ్యాచ్ లు ఓడిపోయింది. కానీ అదే టెంపోను భువనేశ్వర్ కుమార్ ఇక్కడా కంటిన్యూ చేశాడు. మరి ముఖ్యంగా వరుస పెట్టి వైడ్లు వేస్తుండడం అతని బౌలింగ్ లో పస తగ్గిందని నిరూపిస్తున్నాయి. ఇలాంటి నిస్సారకరమైన ఆట తీరు ప్రదర్శిస్తున్న ఆటగాళ్లను ఎలా ఎంపిక చేస్తున్నారని సెలెక్టర్ లపై క్రీడాభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. కాగా ఈ జట్టుతో హేమాహేమీలైన జట్లను ఓడించి టి20 వరల్డ్ కప్ ఎలా తెస్తారని ప్రశ్నిస్తున్నారు.
Also Read: Chicken Skin: చికెన్ స్కిన్ తో తింటే నష్టమా? లాభమా?
Recommended videos: